ఏపీ రాజకీయాలు కులాల చుట్టూనే తిరుగుతాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కులాల ఆధారంగానే నేతలు రాజకీయాలు చేస్తుంటారు. వారికి తగిన ప్రాధాన్యత, పదవులు ఇస్తూ...ఆయా కులాల ఓట్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే ఏపీలో ఎక్కువ గెలుపోటములని ప్రభావితం చేసే కాపు సామాజికవర్గానికి మరింత దగ్గరవ్వడానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కాపు ఓటర్లు ఎక్కువ వైసీపీకి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనసేనకు, టీడీపీకి తెలిపారు.


అయితే 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్ధతుతో విజయం సాధించిన టీడీపీ...మొన్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో  చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా...మళ్ళీ పవన్ కల్యాణ్ కు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు రాజకీయాన్ని గమనించిన జగన్...జనసేన, టీడీపీకి మద్ధతు తెలిపిన కాపులనికూడా దగ్గరచేసుకోడానికి కొత్త వ్యూహం అమలు చేయడానికి రెడీ అయిపోయారు. ఆ వ్యూహంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి గేలం వేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే జగన్ వ్యూహాత్మకంగా...చిరంజీవి మద్ధతు పరోక్షంగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో మొదటిగా ఇటీవల సాహో సినిమాకు ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇవ్వని జగన్ ప్రభుత్వం చిరంజీవి సైరా సినిమాకు ఇచ్చింది. రోజుకు ఆరు షోలు, రిలీజ్ రోజు బెన్ ఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా..ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ పరోక్షంగా ప్రభుత్వానికి పాజిటివ్ గా మారుతుందని అంచనా వేసింది.


ఇక తాజాగా తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ చిరంజీవితో చేయించారు. ఈ కార్యక్రమం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే వైసీపీ నేతలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. పైగా తాడేపల్లి గూడెం పర్యటనలో వైసీపీ నేతలు చిరంజీవితో చాలా క్లోజ్ గా ఉండటం రాజకీయంగా చర్చకు కారణమైంది. ఆయన సైతం వైసీపీ నేతలను అభినందనలతో ముంచెత్తారు.


అయితే, ఆ కార్యక్రమంలో టీడీపీ..కాంగ్రెస్..బీజేపీ నేతలు సైతం పాల్గొన్న.... వైసీపీ నేతలు ప్రముఖ పాత్ర పోషించారు. కానీ, ఎక్కడా జనసేన నేతలు మాత్రం కనిపించకపోవడం విశేషం. మొత్తం మీద చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా....ఆయనతో సఖ్యతగా ఉంటూ.. అనుచరులు, మెగా అభిమానుల మద్ధతు పొందాలని జగన్ చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: