తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వివాదం పతాక స్థాయికి వెళ్లిందనే చెప్పాలి. నిన్నటి  వరుకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య జరిగిన  ఈ వివాదం... కేసీఆర్ సంచలన నిర్ణయాల్లో ఇతర పార్టీలు కూడా ఇందులోకి దిగిపోయాయనే చెప్పాలి.  కాంగ్రెస్ కీలక నేత ఐనా రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వ్యవహరిస్తూ... సీఎం కేసీఆర్ ఆయన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


కేసీఆర్ ఫ్యామిలీని దండుపాళ్యం ముఠాగా నిలిచింది రేవంత్ రెడ్డి... నిజంగానే పెద్ద సంచలనం సుష్టిచారనే చెప్పాలి. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఆసక్తి చూపుతున్న కేసీఆర్... లక్ష మంది ఉద్యోగులున్న ఆర్టీసీలోని 50 వేల మంది కార్మికుల విషయంలో మాత్రం అందుకు చాలా చులకన భావంతో ఉన్నారు అని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.


అల్లుడు కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఆసక్తి చూపుతున్న కేసీఆర్... 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించేందుకు బదులుగా వేలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అల్లుడికి ఉద్యోగం ఇవ్వకుంటే...


 తన కుర్చీ కిందకు నీళ్లొస్తాయన్న భయంతో ఆరు నెలలకే అల్లుడికి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్... ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో మాత్రం ఎందుకు అంత చులకన భావంతో ఉన్నారు అని ఆరోపించారు. ఒక్క అల్లుడికే భయపడి ఆరు నెలలు తిరక్కుండానే మంత్రి పదవి ఇచ్చేసిన కేసీఆర్ కు... 50 వేల మంది కార్మికులు న్యాయ పోరాటం చేస్తే ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఇక చివరికి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగంలోంచి ఎలా తొలగిస్తారో చూస్తామని కూడా రేవంత్ రెడ్డి మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా  చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: