ఏపీలో ఇప్పుడు కొత్త రాజకీయానికి తెర లేచిందా... కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయా... అందుకు త‌మ్ముడు. అన్న‌య్య‌లే ప్ర‌ధాన కేంద్రాలుగా మారారా.. అన్న‌య్య ను ఏపీ సీఎం జ‌గ‌న్ లైన్‌లో పేడితే తమ్ముడిని చంద్రాలు లైన్‌లో పెట్టార‌నే ప్ర‌చారం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతుంది. ఇంత‌కు అన్న‌య్య ఎవ్వ‌రు.. త‌మ్ముడు ఎవ‌రు.. ఇంత‌కు ఈ అన్న‌ద‌మ్ముల‌తో జ‌రుగుతున్న రాజ‌కీయ చ‌ర్చ‌లు ఎటువైపు దారితీస్తాయ‌ని రాజ‌కీయ ప‌రిశీలకుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాజకీయాలు చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రుపుతున్నారు. జ‌గ‌న్ వేస్తున్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ప్ర‌త్య‌ర్థుల‌కు అంతు చిక్కుకుండా ఉంటున్నాయి. తండ్రిని మించిన రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తూ వ్యూహ‌త్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ వేసిన రాజ‌కీయ ఎత్తు చూస్తే ఎంత పెద్ద రాజ‌కీయ నాయ‌కుడికైనా ముచ్చెమ‌ట్టాల్సిందే.. అనుభ‌వ‌జ్ఞుడైన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రాలు వేసిన ఎత్తుకు పైఎత్తు వేసిన జ‌గ‌న్ ఇప్పుడు ఏపీలో కొత్త రాజ‌కీయానికి తెర తీసారు. ఇంత‌కు చంద్రాలు వేసిన ఎత్తు.. సీఎం జ‌గ‌న్ వేసిన పై ఎత్తు.. ఏపీలో జ‌రుగ‌బోయే రాజకీయ స‌మీక‌ర‌ణ‌లు ఎలా ఉండ‌బోతున్నాయో ఓసారి లుక్కేద్దాం...


ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రాలు అధికారం కోల్పోయిన త‌రువాత న‌ష్ట నివార‌ణ చ‌ర్యల్లో భాగంగా మ‌రోమారు పొత్తుల కోసం ఇప్ప‌టి నుంచే ఎత్తులు వేస్తున్నారు. చంద్రాలు రాజ‌కీయ ఎత్తుల్లో భాగంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు మ‌రోమారు బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తుకు తెర‌వెనుక ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే చంద్రాలు ఇప్ప‌టికే త‌న అనుచ‌రుల‌ను బీజేపీలో చేర్పించి పొత్తుల ప‌నుల‌ను ముమ్మ‌రం చేశార‌నే టాక్ ఉంది. ఇక   జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ చంద్రాలు  మంత‌నాలు జ‌రిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ స‌ర్కారుపై భారీ ఎత్తున విమర్శ‌లు చేస్తూ ముందుకు సాగుతున్నారు.


ఇది చంద్రాలు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌న‌కు అనుకూలంగా వాడుకుంటున్నాడ‌నే ప్ర‌చారం రాజ‌కీయ స‌ర్కిల్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక బీజేపీ నుంచి సానుకూల స్పంద‌న రావాల్సి ఉంది. ఇక చంద్రాలు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌న‌వైపుకు మ‌రోమారు లాక్కున్న త‌రుణంలో ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవిని త‌న‌వైపుకు లాక్కునే ప్ర‌య‌త్నం ముమ్మ‌రం చేశార‌ట‌. అందుకు సైరా చిత్రంను, మ‌హాన‌టుడు ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ను త‌నకు అనుకూలంగా మ‌లుచుకున్నార‌ట‌. ఇక తాడేప‌ల్లిగూడేంలో జ‌రిగిన‌ ఎస్వీఆర్ విగ్రహావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం వైసీపీ నేత‌లు, కాపు నేత‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే నిర్వ‌హించారు.


ఇక సైరా  చిత్రానికి ప్ర‌త్యేక షోలు వేసుకునేందుకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి ఏపీ మంత్రినే రంగంలోకి దిగి సాయం చేశాడు.. దీనికి తోడు మెగాస్టార్ కు అనుకూలుడైన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు త్వ‌ర‌లో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న నేప‌థ్యంలో ఇద్ద‌రు క‌లిసి తాడేప‌ల్లిగూడెంలో ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అంటే అన్న‌య్యతో గంటా శ్రీనివాస‌రావు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సూచ‌న‌ల మేర‌కు  ర‌హాస్య మంత‌నాలు జ‌రిపార‌ట‌.


ఇక ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మాట‌వ‌రుస‌కైనా పిలువ‌లేదు. అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కావాల‌నే దూరం చేస్తూ.. అన్న‌య్య‌ను త‌న‌వైపుకు లాక్కునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ట‌. అంటే త‌మ్ముడితో చంద్రాలు.. అన్న‌య్య‌తో సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ మంతనాలు జ‌రుపుతున్నార‌ట‌.. సో ఇది ఏటువైపు దారితీస్తాయో.. భ‌విష్య‌త్‌లో ఏ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతాయో వేచి చూడాల్సిందే...



మరింత సమాచారం తెలుసుకోండి: