చరిత్ర‌ను మార్చ‌డానికి, మ‌లుపు తిప్ప‌డానికి ఎవ‌రూ పైనుంచి దిగిరారు. వారు మ‌న చుట్టునే ఉంటారు. అయితే అలాంటి వారు ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారి నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని పెడితే.. వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌నిలేదు. అవును..కొంచెం ఆల‌స్యం జ‌రిగింది కానీ.. స‌రైన స‌మ‌యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్ర‌జ‌లు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల్లో పెట్టారు.  వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఛిన్నాభిన్న‌మై, ఆర్థిక రంగం కుదేలై..,పొరుగు రాష్ట్రాల ముంద‌ర ఆంధ్రుడు త‌ల‌వంచుకు నిల‌బ‌డాల్సి వ‌స్తుందేమో అనుకునే త‌రుణంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాడు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంవైపు నడిపిస్తున్నాడు.


ఇకపోతే జగన్ మీద ప్రతిపక్షాలు అనవసరంగా నోరూ పారేసుకుంటున్నాయి. వారి అసహనానికి కారణం అయిదేళ్ల పాటు చంద్రబాబు ఏ విధంగా అయితే కమ్మ సామాజిక వర్గానికి పనికివచ్చేలా, వారి వ్యాపారాలకు అనుకూలించేలా నిర్ణయాలు తీసుకున్నారో ? సరిగ్గా వాటికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌. ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు కమ్మ సామాజిక వర్గ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తున్నాయి. ఏ తెలుగుదేశం పార్టీకి బలమైన వెన్నుదన్నుగా వుంటారనుకున్నారో, ఆ వర్గం వచ్చే ఎన్నికల నాటికి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి చేరుకుంటోంది.


బాబుగారు ఏ పథకం చేపట్టినా, కీలక నిర్ణయం తీసుకున్నా, ఫుల్‌ పేజీ ప్రకటనలే. కోట్లకు కోట్ల బిల్లులే. అలాంటిది ఆర్టీసీ, వాలంటీర్ల వ్యవస్థ, మద్యం ప్రయ్నివేటు దుకాణాల బంద్‌, విలేజ్‌ సెక్రటేరియట్‌ ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా, హడావుడి లేదు, ప్రకటనలు లేదు. ఇలా అయిదేళ్లు మనుగడ సాగించాలంటే మీడియాకు చాలా కష్టంగా మారింది ఇలా బాబుకు గాని ఆయన వర్గానికి గాని ఎటు మింగుడుపడని పరిస్దితి ఎదురవ్వుతుంది..కాని జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా పాలన సాగిస్తున్నారు. కరెంట్‌ కోత అన్నది ఒక్కటి తప్ప మరేదీ జనాలకు పట్టే సమస్యలు కావు.


జనాలకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వ సిబ్బందిని చేసాడు. వాళ్లకు మరో రెండేళ్లు సర్వీస్‌ పెంచాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చాడు. ఫించన్‌ దారులకు కూడా కనీసం పదివేలు పెరిగేలా చేసాడు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు. వాహన మిత్రతో ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలుపుకున్నారు.  అవినీతి అన్నది లేకుండా చేయడానికి కట్టుబడి వున్నాడు. ఆ విషయంలో ఎమ్మెల్యేలు కూడా దడదడ లాడుతున్నారు.అందువల్ల ఏ వర్గానికి పెద్ద పీట వేస్తున్నాడు, ఏ వర్గాన్ని పక్కన పెడుతున్నాడు లాంటివి జనాలకు పట్టవు. జగన్‌ ఈ విషయంలో రెండు అంచెల వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు.


అటు ప్రజలకు కావాల్సింది వాళ్లకు ఇవ్వడం, ఇటు ప్రతిపక్షం పని, దానికి మద్దతుగా వున్నవారి పని పట్టడం. ఇలాంటి నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత చేయాల్సిన పోరును ఇప్పుడే చేస్తున్నారు చంద్రబాబు. అస్త్రాలన్నీ ఇఫ్పుడే వాడేస్తున్నారు. అసహనం అంతా ఇప్పుడే ప్రదర్శిస్తున్నారు. అవసరమైన టైమ్‌ వచ్చేసరికి అస్త్రాలు వుండవు. బలమూ వుండదు.కానీ జగన్‌ మాత్రం ఇవేవీ పట్టనట్లు, ఇవేవీ చూడనట్లు, తన వ్యవహారం కాదన్నట్లు, తాను అనుకున్న వ్యూహాలు అలా అలా అమలు చేసుకుంటూ మొండిగా సాగిపోతున్నారు. అందుకే ప్రజలకు ఇలాంటి నాయకుడే కావాలని ఉంటుంది తప్పితే ఊసరవెల్లిలా రంగులు మార్చే చంద్రబాబులాంటి వారు కావాలని కోరుకోరు..

మరింత సమాచారం తెలుసుకోండి: