న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ ఆ సంస్థ నుంచి దాదాపుగా పంపించేసిన రవిప్రకాశ్ కు నిజంగానే సీన్ సితార్ అవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పట్లో టీవీ 9 నిధుల గోల్ మాల్ ఫోర్జరీ మోసం కాకుండా తదితర కేసుల్లో చిక్కుకున్న రవిప్రకాశ్ తాజాగా కఠినమైన ఫెమా చట్టాలను ఉల్లంఘించారన్న కోణంలో ఇప్పుడు నేరుగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ఫిర్యాదు వెళ్లింది. వైస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. 


రవిప్రకాశ్ పై సీబీఐ విచారణతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తోనూ విచారణ చేయించాలని కూడా సాయిరెడ్డి తన లేఖలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరడం ఇప్పుడు నిజంగానే కలకలం సృష్టిస్తోంది. రవిప్రకాశ్ పాల్పడ్డ సరికొత్త నేరాలు ఇవేనని ఇప్పటికే సీబీఐ ఈడీ ఉచ్చులో ఇరుక్కున్న సానా సతీష్ మొయిన్ ఖురేషీలతో కలిసి రవిప్రకాశ్ చెప్పలేనంత మందిని మోసం చేశారని ఈ మోసాల ద్వారా సంపాదించిన మొత్తాలను ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని కూడా సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఘాటుగా వినిపించారు.


సాయిరెడ్డి చేసిన ఫిర్యాదులో రవిప్రకాశ్ కు చెందిన చాలా అవినీతి వ్యవహారాలను సాయిరెడ్డి పక్కా ఆధారాలనే చూపించినట్లు తెలుస్తోంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటుగా ఆదాయపన్నును కూడా కట్టని రవిప్రకాశ్ పెద్ద ఎత్తున అక్రమాస్తులను సంపాదించాడని సాయిరెడ్డి ఆ ఫిర్యాదులో వివరించారు. ప్రపంచస్థాయిలో బ్యాంకులను మోసం చేసిన కేసులో గట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి మొయిన్ ఖురేషీతో పాటు దేశంలోనే సంచలనం రేకెత్తిన పలు కీలక కేసుల్లో పాత్ర ఉంది అంటూ ఆరోపణలు ఎదుర్కొవడంతో  పాటుగా సీబీఐ ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న మన తెలుగు వ్యక్తి అయిన సానా సతీష్ తో కలిపీ రవిప్రకాశ్ మోసాలకు పాల్పడ్డారని కూడా సాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలియచేశారు.


 ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రముఖ నగల వ్యాపారి సుఖేశ్ గుప్తాను నకిలీ డాక్యుమెంట్లతో బెదిరించి హవాలా తరహా అక్రమాలకు పాల్పడ్డారని కూడా సాయిరెడ్డి తన నివేదికలో తెలిపారు. హవాలా మార్గం ద్వారా సంపాదించిన సొమ్మును రవిప్రకాశ్ దేశం దాటించేసి ఆ సొమ్ముతో కెన్యా, ఉగాండాల్లో సిటీ కేబుల్ లో పెట్టుబడులను పెట్టారని కూడా సాయిరెడ్డి సంచలన విషయాన్ని తన నివేదికలో పూర్తి వివరాలను తెలియ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: