విజయదశమి నాడు భారత వైమానిక దళంలోకి బలమైన అస్త్రం చేరింది. అనేక మలుపుల తర్వాత తొలి రాఫెల్ యుద్ధ విమానం భారత్ అందుకుంది. ఫ్రాన్స్ లో జరిగిన కార్యక్రమంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చేతుల మీదుగా అందుకున్నారు. అక్కడే ఆయుధపూజ కూడా నిర్వహించారు.  


దసరా నాడు వైమానిక దళం అసలు సిసలు ఆయుధ పూజ చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మక, అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ భారత అమ్ములపొదిలో చేరింది. ఫ్రాన్స్ లో తయారైన ఈ యుద్ధ విమానాలను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంఛనంగా స్వీకరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ తో భేటీ అయిన రాజ్ నాథ్, ఆయన చేతుల మీదుగా రాఫెల్ యుద్ధ విమానాలను అందుకున్నారు. ఫ్రాన్స్ తీర ప్రాంత నగరం బెర్డెక్స్ లో రాఫెల్ యుద్ధ విమానాలకు రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజను నిర్వహించారు. ఆ తర్వాత అందులో కొంత సేపు ప్రయాణించారు. ఈ తరహా యుద్ధ విమానం వాయుసేన అమ్ములపొదిలో చేరడం ఇదే తొలిసారి. 


భారత్ కు  దసాల్ట్ ఏవియేషన్ కంపెనీతో జరిగిన ఒప్పందం ప్రకారం,  36 రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసింది. వైమానిక దళ వార్షికోత్సవ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ విజయదశమి నాడు వాటిని అందుకున్నారు. ఈ విమానంతో, భారత్ ఉపఖండలో ఎదరురుండదనీ,  గగనతలంలో భారత్ శక్తిమంతంగా ఎదుగుతుందని వైమానిక దళం అబిప్రాయ పడుతోంది. 
ఈ తరహా క్షిపణి వ్యవస్థ ప్రస్తుతం బ్రిటన్‌ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్ వైమానిక దళంలో మాత్రమే అందుబాటులో ఉంది. మెరుపు వేగంతో, చురుకైన రాడార్ వ్యవస్థతో క్షిపణి వ్యవస్థ అధునాతన రీతిలో ఉంటుంది. 


మూడు రోజుల పర్యటనలో భాగంగా  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ సింగ్ మంగళవారం ఉదయం ఫ్రాన్స్ చేరుకున్నారు. భారత వాయుసేన తరఫున తొలి రాఫెల్ యుద్ధవిమానాన్ని ఆయన అందుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవం, దసరా కలిసి రావడంతో పాటు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని రాజ్ నాథ్ అందుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ఫ్రాన్స్ లోనే రాజ్ నాథ్ సంప్రదాయబద్ధంగా ఆయుధపూజ కూడా చేశారు. మరోవైపు పాక్ మాటల్లోని డొల్లతనం మరోసారి బయటపడింది. పాక్  తప్పుడు ప్రకటనల విషయం భారత వైమానిక దళ 87వ వార్షికోత్సవాల్లో మరోసారి వెలుగుచూసింది. ఐఏఎఫ్ యుద్ధ విమానాల విన్యాసాల్లో భాగంగా సుఖోయ్ 30 ఏంకేఐలు గగనతలంలో సందడి చేశాయి. గాల్లో ఎగురుతూ రకరకాల ఫీట్లు చేశాయి. రెండు సుఖోయ్-30 ఎంకేఐలు గగన విన్యాసాల్లో పాల్గొని అవెంజర్ ఫార్మేషన్ తో ఆకట్టుకున్నాయి. అయితే, గగనతల విన్యాసాల్లో పాల్గొన్న రెండు సుఖోయ్-30 ఎంకేఐలలో ఒకటైన ఎవెంజర్ 1 విమానాన్నే పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న కూల్చేసినట్టు ప్రకటించుకుంది. కానీ, పాక్ కూల్చేశానని చెప్పుకున్న ఎవెంజర్ 1 వాయుసేన విన్యాసాల్లో స్వైర విహారం చేసింది. అంతేకాదు... ఫిబ్రవరి 27న ఆ విమానాన్ని నడిపిన ఇద్దరు ఐఏఎఫ్ సిబ్బందే ఇప్పుడీ విమానాన్ని నడిపారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: