ఎంతసేపు ఎదుటివారిమీదనే ఘాటు విమర్శలు చేసి పొద్దుపుచ్చితే అంతటి మొనగాడు లీడర్ అనుకుంటారన్న భ్ర‌మల్లో నేతాశ్రీలు బతికేస్తున్నారు. ఏపీ రాజకీయల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది నకారాత్మక రాజకీయాలు ఇపుడు బీజేపీకి కూడా  వంటబట్టాయి అదేంటో రాజకీయాలు అలా తయారైపోయాయి. మన వైపు నుంచి బలం పెంచుకోవడం కాదు. అవతల వారి మీద బురద జల్లుడు షురూ చేస్తే చాలు. మన రాజకీయం పండినట్లే. 


నెగిటివ్ పాలిటిక్స్ ఇపుడు బాగా నడుస్తున్న చరిత్రగా  ఉంది. చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఇది. .ఏపీ కమలనాధుడు కన్నా లక్ష్మీ నారాయణే  దీని ఎంచక్కా అనుసరిస్తున్నారు. తాజాగా బిక్షాటన పేరిట ఇసుక పాలిటిక్స్ బాగానే నడిపా రు.  కన్నా లక్ష్మీ నారాయణ  ప్రజల కోసం పోరాడుతున్నారని చెబుతున్నా ఆయన  కేవలం తన రాజకీయ  ఉనికి కోసమే పోరాడుతున్నారని  వైసీపీ నేతలు అంటున్నారు . నిజానికి ఏపీలో  వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయడానికి టీడీపీ ఎపుడూ తయారుగా ఉంటుంది.


అయిదేళ్ళు జమానా నడిపిన టీడీపీకి అది సులువు కూడా. మరో వైపు అనివార్యం కూడా వైసీపీ ఏ ఫైల్ కదిపినా టీడీపీ కధలే చెబుతుంది కాబట్టి ఆ విధంగా రియాక్ట్ కావాల్సిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. మరి ఈ సందట్లో సడేమియాగా బీజేపీ దూరడమే వింతలో కెల్లా వింతా. ప్రతీ రోజూ వైసీపీని ఆడిపోసుకుంటే బీజేపీ బలం ఏపీలో పెరిగిపోతుందా. కన్నా  లక్ష్మీనారాయణ రాజకీయం కరెక్టేనా అన్నది కూడా వైసీపీ నుంచే కాదు ఆ పార్టీ నుంచి కూడా  వస్తున్న ప్రశ్నలు. నిజానికి రెండేళ్లుగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండి కన్నా సాధించినది ఏంటి. తన సొంత జిల్లాలోనైనా బీజేపీని బలోపేతం చేశారా, ఇక ఇతర పార్టీల నుంచి నాయకులను కొందరినైనా తెచ్చి పటిష్టం చేశారా. నాటి టీడీపీ సర్కార్ మీద కనీసం ఒక్క ప్రజా ఉద్యమం అయినా నడిపారా.


మరి ఈ పనులేవీ చేయకుండా కేవలం మీడియా బేబీ మాదిరిగా నాలుగు నెలల వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ పెద్ద గొంతు చేస్తే అధినాయకత్వం కన్నాను కొనసాగిస్తుందా. శభాష్ ప్రెసిడెంట్ అంటూ మరో మారు కిరీటం తొడుగుతుందా. కన్నా కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని టీడీపీతో మిక్స్ చేసి చేస్తున్న ఈ పులిహోర రాజకీయం వల్ల ఆయన పదవి ఎంతవరకూ  నిలబడుతుందన్నది మరో మూడు నెలల్లో తేలిపోతుందని సొంత పార్టీలోనే కామెంట్స్ పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: