పాక్ ఒక మాయల మారి టక్కుటమారి అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా తాజాగా పాక్ మాటల్లోని డొల్లతనం మరోసారి వెలుగు చూసింది. తప్పుడు ప్రకటనలు చేయడంలో పాక్ ఎలాంటి లజ్జ లేకుండా నిస్సిగ్గుగా ప్రవర్తించటం భారత్ కు అనుభవత్పూర్వకంగా తెలుసు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఇండియన్ ఎయిర్బేస్ "హిందన్ వైమానిక స్థావరం" లో భారత వైమానికి దళం నిన్న మంగళవారం నిర్వహించిన 87 వ వార్షికోత్సవాల్లో మరోసారి వెలుగుచూసింది. 

1

ఈ సందర్భంగా వైమానిక దళాధిపతి రాకేష్ కుమార్ సింగ్ బదోరియా ఆ సైనిక స్థావర సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. వైమానిక దళదినోత్సవానికి సైనిక దళాధిపతి బిపిన్ రావత్ నౌకా దళాధిపతి కరంబీర్ సింగ్ హాజరై వైమానిక దళం నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వాయుదళానికి పతకాల అందజేత జరిగింది. అబ్బురపరిచే సైనికపాఠవం కనువిందు గొలిపింది. పాక్ తో జరిగిన వైమానిక ఘర్షణలో ప్రఙ్జ కనపరచిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్ 21 బైసన్ యుద్దవిమానంలో అద్భుత స్వైరవిహారం చేశారు 

Image result for Hindon air base 87 th birthday

ఈ సందర్భంగా పాక్ అబద్ధాల పుట్ట పగిలి గుట్టు బట్టబయలైంది. ఐఏఎఫ్ యుద్ధ విమానాల విన్యాసాల్లో భాగంగా సుఖోయ్ 30 ఏంకేఐలు గగన తలంలో సందడి చేశాయి. నింగిలో ఎగురుతూ బహుముఖ విన్యాసాలు చేశాయి. రెండు సుఖోయ్-30 ఎంకేఐలు గగన విన్యాసాల్లో పాల్గొని 'అవెంజర్ ఫార్మేషన్' లో ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడే ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
Image result for bipin rawat rakesh kumar singh karamvir singh

గగనతల విన్యాసాల్లో పాల్గొన్న రెండు సుఖోయ్-30 ఎంకేఐలలో ఒకటైన 'ఎవెంజర్ 1' విమానాన్నే పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27 న కూల్చేసినట్టు ప్రకటించుకోవడం జరిగింది. పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే మరో విషయం కూడా ఉంది. ఏదైతే తాము కూల్చేశామని పాక్ చెప్పుకుందో అదే 'ఎవెంజర్ 1' (సుఖోయ్-30ఏంకేఐ) ఈ రోజు వాయుసేన విన్యాసాల్లో స్వైరవిహారం చేయడంతో పాటు ఫిబ్రవరి 27న ఆ విమానాన్ని నడిపిన ఇద్దరు ఐఏఎఫ్ సిబ్బందే ఇప్పుడు అదే విమానాన్ని నడపడం మరింత ఆసక్తిమైంది. 
Image result for bipin rawat 

గడచిన ఫిబ్రవరి 26 న బాలాకోట్ దాడుకు సమాధానంగా ఆ తరవాత రోజే భారత్‌ పై పాక్ వాయుదాడులకు ప్రయత్నించినప్పుడు భారత్ వాయుసేన బలంగా తిప్పికొట్టింది. అమెరికా తయారు చేసిన ఎఫ్-16 తో పాక్ దాడికి దిగినప్పుడు దానిని మిగ్-21 బైసన్‌తో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చేశాడు. అయితే, ఎఫ్-16 కూలిపోలేదంటూ బుకాయించిన పాక్ తమ వాదనకు బలం చేకూరేందుకు తామే స్వయంగా సుఖోయ్-30 ఎంకేఐని కూల్చేశామని వాదన చేసింది. ఆ తర్వాత మిగ్-21 బైసన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోవడం, పట్టుబడిన అభినందన్‌ ను భారత దౌత్య ఒత్తిడికి తలొగ్గి పాక్ తిరిగి భారత్‌ కు అప్పగించడం జరిగింది. ఆసక్తికరంగా, ఇవాల్టి ఐఏఎఫ్ వార్షికోత్సవంలో మిగ్-21 బైసన్‌ను అభినందన్ వర్ధమాన్ స్వయంగా నడిపి అందరి హృదయాలను మరోసారి దోచుకున్నారు.

Image result for bipin rawat rakesh kumar singh karamvir singh


మరింత సమాచారం తెలుసుకోండి: