తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు తమ తమ ప్రతిభాపాటవాలను దశ దిశలా వ్యాప్తిన్చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత వస్త్రాలకు గుర్తింపు తెస్తున్నారు. ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన సదస్సులో వరంగల్ నగరంలోని కొత్తవాడ చేనేత కార్మికునికి ప్రత్యేక గుర్తింపు లభించింది.  అక్టోబర్ 7న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగే అంతర్జాతీయ నూలు సదస్సులో పాల్గొనాలని పిలుపు అందించింది. 
ఈ సదస్సులో పాల్గొన్న చేనేత కార్మికుడు పిట్ట రాములు దేశం తరఫున తెలంగాణలో చేనేత ఉత్పత్తుల తయారీలో భాగమైన నూలు వడికే దర్రీ రాట్నాన్ని ప్రదర్శించడం విశేషం.



అంతర్జాతీయ కాటన్ దినోత్సవం సందర్భంగా  ఈ సదస్సును నిర్వహించారు. వరల్డ్ ట్రేడ్ ఆర్డనైజేషన్ (డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దేశం నుంచి ఈ ఏడాది వరంగల్ కొత్తవాడకు చెందిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత పిట్ట రాములు వెళ్లారు. నూలు వడికె రాట్నాన్ని అక్కడికు తీసుకుని వెళ్లారు. సదస్సుకు భారత్ తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేందట మంత్రి ఇరానీ అంతర్జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతను చాటిచెప్పారు. నూలుతో భారత్‌లో తయారు చేస్తున్న వస్ర్తాలతోపాటు కొత్తవాడలోని ఉత్పత్తులైన దర్రీస్, బెడ్‌షీట్ల అక్కడివారికి వివరించారు.



వరంగల్ జిల్లా వాసికి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. కొత్తవాడకు చెందిన పిట్టరాములు కళకు గుర్తింపుగా అంతర్జాతీయ నూలు దినోత్సవం సందర్భంగా వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసే సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు చేనేత కార్మికుడిగా భారత్‌ నుంచి ఈ సదస్సుకు వెళ్తున్న వారిలో రాములు మొదటి వాడిగా ఖ్యాతికెక్కనున్నారు. పనిని పనిగా కాకుండా దానిలో ఏదైనా సాధించాలన్న తపనతో నాలుగు నెలలు శ్రమించిన రాములు దర్రీపై మొఘల్‌ సామ్రాజ్య వేట విధానాన్ని మగ్గంపై నేశారు. ఇందుకు గాను 2015లో ఉత్తమ జాతీయ హ్యాండ్లూమ్ అవార్డును మినిస్ట్రీ ఆఫ్‌ టెక్‌టైల్స్‌ అందచేయడం పట్ల చేనేత కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: