భారత వైమానిక దళం అమ్ములపొదిలో మరో అత్యంత ముఖ్యమైన అస్త్రం చేరింది. ఫ్రాన్స్‌ దేశం తయారు చేసిన రఫేల్‌ యుద్ధ విమానం దసరా - విజయదశమి రోజున భారత్‌కు అందింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌ చేతుల మీదుగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాఫెల్‌ ను డసోల్ట్‌ ఏవియేషన్‌ తయారీ కేంద్రంలో తొలి రఫేల్‌ను  సగర్వంగా స్వీకరించారు.

బోర్డియాక్స్‌ లో రఫేల్‌ యుద్ధవిమాన స్వీకరణ కార్యక్రమం ఉత్సవంలా జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ:  "అనుకున్న సమయానికి రాఫేల్‌ అందుకోవడం ముదావహం. రాఫేల్‌ రాక తో భారత వాయుసేన మరింత బలోపేతం అవుతుంది. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాల్లో మరింతగా ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను. ఇవాళ భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతనాధ్యాయం. రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లో ప్రయాణించాలని ఎంతోకాలంగా ఉత్సాహంగా ఈ రోజుకోసం నిరీక్షిస్తున్నాను. దసరా భారత్ కు ఎంతో పర్వదినం పురాణకాలం నుండి చారిత్రాత్మక కాలమే కాదు ఆధునిక కాలంలోను ఆ ఉత్తేజం ఉత్సాహం ఇనుమడిస్తూ వస్తునా రోజిది. ఇవాళ చెడుపై  మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారత్‌లో దసరా పండుగ (విజయదశమి) జరుపుకుంటామని, 87వ ఎయిర్‌ఫోర్స్‌-డే కూడా ఇవాళే" నని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.
Image result for rafale jet fighter

అనంతరం విమానానికి రాజ్‌నాథ్‌ దసరా పండుగను పురస్కరించుకొని - రఫేల్ జెట్ కు ఆయుధ పూజ చేసిన తరువాత తొలి యుద్ధ విమానాన్ని డెలివరీ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన రాజ్ నాథ్ ఫ్రాన్స్ కు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇండియాకు ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామయని ఇరు దేశాల మధ్యా సంబంధాలు మరింతగా బలపడ్డాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్యా స్నేహబంధం కొనసాగుతుందని చెప్పారు.
Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAJ' target='_blank' title='raj -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>raj </a>nath ayudhapuja
అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌తోనూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. రెండు దేశాల రక్షణ, వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్‌, ఫ్రాన్స్‌ బలమైన ద్వైపాక్షిక బంధాన్ని ఈ భేటీ చాటిందని రక్షణ శాఖ పేర్కొంది. బోర్డియాక్స్‌లో రఫేల్‌ యుద్ధ విమాన తయారీ కేంద్రాన్ని రాజ్‌నాథ్‌ పరిశీలించారు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAJ' target='_blank' title='raj -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>raj </a>nath ayudhapuja

మరింత సమాచారం తెలుసుకోండి: