2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎంపీడివో సరళ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎంపీడీవో సరళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ తరువాత బెయిల్ పై విడుదల చేసిన విషయం తెలిసిందే. 
 
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అరెస్ట్ వెనక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు అతని అనుచరుల హస్తం, నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల హస్తం కూడా ఉందని ఆరోపణలు చేశారు. కోటంరెడ్డి మాట్లాడుతూ ఎంపీడీవో సరళ తనపై చేస్తున్న ఆరోపణలు అబద్ధమని అన్నారు. ఇంటిపై దాడి చేశానని చెబుతున్న ఎంపీడీవో సరళ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిందని అన్నారు. 
 
నెల్లూరు జిల్లా ఎస్పీతో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని ఆ విభేదాల వలన ఎస్పీ సీఎం ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని చెబితే వ్యక్తిగత కక్ష్య తీర్చుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఎస్పీతో వ్యక్తిగత విభేదాల గురించి నాలుగు రోజుల క్రితం కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. కొన్ని రోజులుగా ఎంపీడీవో సరళను ఒక బిల్డింగ్ కు వాటర్ కనెక్షన్ ఇవ్వాలని కోరానని మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దని చెప్పారని ఎంపీడీవో సరళ తనతో చెప్పిందని కోటంరెడ్డి అన్నారు.  
 
జిల్లాలో నేతల మధ్య ఉండే ఆధిపత్య పోరు వలనే ఈ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమ హవానే నడవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో ఈ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: