Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:56 am IST

Menu &Sections

Search

"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు

"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రానున్న అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అంటే "ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" ఎదగాలన్న భారత్ తన లక్ష్యాన్ని సాధించేందుకు దేశంలో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం - డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ - డీపీఐఐటీ - కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర వెల్లడించారు.

 

పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సారథ్యంలో ఈ లక్ష్యం సులభసాధ్యమేనని ఇటీవల "వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-భారత ఆర్థిక సదస్సు" ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. "అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టిన భారత్‌, 2024 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకుందని ఇది కచ్చితంగా సాధ్యమే. ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం స్థాయిలో ప్రభుత్వాలు పటిష్టమైన విధానాలు అమలు చేస్తుండటంతో ఇందుకు పూర్తి అనువైన పరిస్థితులు ఉన్నాయి" అని మహాపాత్ర తెలిపారు.

 India

 అధిక వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టబోతోందని నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.  మరోవైపు, చౌక ధరలు, డిస్కౌంట్లతో పోటీ సంస్థలను దెబ్బకొట్టేందుకు ఈ–కామర్స్‌ వేదికను విదేశీ కంపెనీలు ఉపయోగించరాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సూచించారు. విదేశీ ఈ–రిటైల్‌ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నే ఆందోళనల నేపథ్యంలో గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊతం ఇవ్వాలని గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఆది గోద్రెజ్‌ చెప్పారు. మందగిస్తున్న ఎకానమీ వృద్ధి రేటుకు తోడ్పాటునిచ్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇవి ద్రవ్యలోటును పెంచేవే అయినా తప్పక తీసుకోవాల్సిన చర్యలని గోద్రెజ్‌ చెప్పారు. అటు, ఇంటర్నెట్‌ సేవల లబ్ధి, ప్రయోజనాలు అందరికీ సమానంగా అందాలని, ప్రాంతీయ భాషల్లో మరింత కంటెంట్‌ అందుబాటు లోకి రావాలని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. 

 

భద్రతాపరమైన అంశాల పేరిట చైనా సంస్థ హువావే ను ప్రపంచ దేశాలు నిషేధించేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, భారతి ఎయిర్‌-టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ఆ కంపెనీకి బాసటగా నిల్చారు. హువావే ఉత్పత్తులు అధునాతనమైనవని, పోటీ సంస్థల ఉత్పత్తులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఉత్తమమైనవని ఆయన చెప్పారు. 5-జీ సేవలకు సంబంధించి హువావే కచ్చితంగా బరిలో ఉండాల్సిందేనని మిట్టల్‌ చెప్పారు. అయితే, భద్రతాపరమైన రిస్కుల వల్లే హువావేని వ్యతిరేకిస్తున్నామని, రక్షణాత్మక ధోరణులకు, దీనికి సంబంధం లేదని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ స్పష్టం చేశారు.

India's quest to become a $5 trillion economy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
కేంద్రం సంచలన నిర్ణయం: ఒక్కో కుటుంబానికి ₹5.50 లక్షలు ప్రయోజనం
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
ఆర్ధిక సంక్షోభానికి ఇదేమైనా దారితీస్తుందా?
రాజ్ నాధ్ ఆయుధ పూజ - రఫేల్ గగన విహారం - పాక్ గుండెల్లో రైళ్ల పరుగులు
About the author