బండారు దత్తాత్రేయ...సౌమ్యుడైన రాజ‌కీయ‌వేత్త‌. ఈ బీజేపీ నేత పేరు చెపితేనే.... ఏటా దసరా పండుగ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం గుర్తుకు వ‌స్తుంది. ప్ర‌జాప్ర‌తినిధిగా, కేంద్రమంత్రిగా ఉన్నా...ఆయ‌న త‌న అల‌వాటును కొన‌సాగించారు. ఇటీవ‌ల ద‌త్తాత్రేయ‌ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. అయితే...ఈ ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ...ఆయ‌న త‌న అల‌వాటు మానుకోలేదు. అయితే, నేరుగా ఆయ‌న నిర్వ‌హించ‌డం లేదు...తండ్రి ద‌త్తాత్రేయ‌ గవర్నర్ బాధ్యతలు చేపట్టినందున ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 


‘అలయ్‌ బలయ్‌’ను దత్తాత్రేయ 15ఏండ్లుగా నిర్వహిస్తున్నారు. ఈనెల 10న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో తాను నిర్వహిస్తున్నట్లు విజ‌య‌ల‌క్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. కాగా, 2015లో దత్తాత్రేయ నిర్వ‌హించిన అల‌య్ బ‌ల‌య్‌కి అలయ్ బలయ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు పంపారు. అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ మోడీ సందేశం పంపారు. ఈ కార్యక్రమం ఐక్యతకు చిహ్నమని ప్రధాని కొనియాడారు.


ప‌లు సంద‌ర్భాల్లో దత్తాత్రేయ మాట్లాడుతూ...అలయ్-బలయ్ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత 12ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. వర్గ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా అందరిని ఒకే వేదికపైకి తీసుకురావడమే అలయ్-బలయ్ ఉద్దేశమన్నారు. అలయ్-బలయ్ గొప్ప వంతెన లాంటిదని హాజ‌రైన ప‌లువురు కొనియాడారు. ``అందరిలో సోదరభావం పెంపొందించే కార్యక్రమం అలయ్‌బలయ్. అలయ్-బలయ్ అద్భుతమైన కార్యక్రమం.`` అని ప్ర‌శంసించారు. కాగా, అలయ్-బలయ్‌ను దత్తాత్రేయ నిర్వఘ్నంగా కొనసాగించ‌గా...ఆయ‌న కుమార్తె ఆ సంప్ర‌దాయాన్ని పాటించ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని పార్టీలతో కలిసి స్నేహపూర్వకంగా ఉండటం అరుదైన విషయం కాగా, వారంద‌రిని ఒకే తాటిపైకి తీసుకువ‌చ్చి పండుగ స్ఫూర్తిని కొన‌సాగించ‌డం మ‌రింత సంతోష‌క‌ర‌మంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: