హనీ ట్రాప్, మనీ ట్రాప్ లా కొత్తగా సెక్స్ ట్రాప్ పుట్టుకొస్తోంది. ఈ సెక్స్ ట్రాప్ ఎక్కువగా స్టార్ హోటళ్లలో జరుగుతోంది. కాలేజీలలో చదివే అమ్మాయిలు డబ్బు కోసం ఆశ పడి ఈ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుంటున్నారు. కొత్తగా ఈ సెక్స్ రాకెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలు ఆ తరువాత ఈ రాకెట్ నుండి బయటపడాలని ప్రయత్నించినా అంత తేలిక కాదు. సెక్స్ స్కాండల్ టీమ్స్ బార్ గర్ల్స్ తో కూడా సెక్స్ ట్రాప్ గురించి డీల్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. 
 
సెక్స్ స్కాండల్ నిర్వాహకులు మొదట సోషల్ మీడియా లో చాటింగ్ ద్వారా పరిచయం అవుతారు. అమ్మాయిల్ని టార్గెట్ చేసి డబ్బు, కార్, లగ్జరీ లైఫ్ ఇస్తామని ఆశ చూపుతారు. ఒప్పుకున్న  అమ్మాయిలను రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పరిచయం అయ్యేలా చేస్తారు. ఆ తరువాత రహస్యంగా వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తారు. అడిగినంత డబ్బు ఇస్తే మాత్రమే వీడియోలను డిలేట్ చేస్తామని అటు రాజకీయనాయకుల్ని, ఇటు అమ్మాయిల్ని మోసం చేస్తారు. 
 
సెక్స్ స్కాండల్ నిర్వాహకులు హై ఫ్రొపైల్ అమ్మాయిలను ఎక్కువగా ఇందులోకి లాగటానికి ప్రయత్నం చేస్తారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో హనీ ట్రాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈజీ మనీ కోసం ఎక్కువగా అమ్మాయిలు ఈ ట్రాప్ లో పడుతున్నారని తెలుస్తోంది. కొందరు అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారని సమాచారం. సెక్స్ స్కాండల్ నిర్వాహకులు ఎవరు ఎవరిని కలిసినా అంతా హైటెక్ లెవెల్లో జరిగేలా ప్లాన్ చేసుకుంటారు . 
 
సెక్స్ స్కాండల్ నిర్వాహకులు మాట్లాడే సమయంలో కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఈ పనులు చేస్తారు. పోలీసులు ఇప్పటికే హనీ ట్రాప్ నిర్వాహకులను పట్టుకుంటున్నప్పటికీ కొత్తగా ఇలాంటి వారు పుట్టుకొస్తూనే ఉన్నారు. అమ్మాయిలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు ఎవరైనా ఈ సెక్స్ స్కాండల్ నిర్వాహకుల బారిన పడితే మాత్రం భవిష్యత్తులో చాలా సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: