రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఐదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రభుత్వం, మీరు దిగొచ్చే వరుకు మేము సమ్మె అపమూ అని ఆర్టీసీ కార్మికులు ప్రవర్తిస్తున్నారు. వీరి ఇద్దరి మధ్య ప్రయాణికులు నలిగిపోతున్నారు. పండగ వేళ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేల చేశారు. 

                    

ఇంకా హైదరాబాద్ నగరంలో ప్రయాణించే వారికీ అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్లు చుక్కలు చూపిస్తున్నారు. 10 రూపాయిల టికెట్ 30 రూపాయలకు అమ్ముతున్నారు. టికెట్ ఇవ్వమంటే ఇచ్చేది లేదు ఉంటె ఉండు లేకుంటే దిగు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. 

                   

అయితే ఇప్పటి వరుకు టీఎస్ఆర్టీసీ కార్మికులు బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ లో కొత్త కార్మికులను తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో ప్రతిపాదనలు చేసే పనిలో అధికారులు ఉన్నారు. కాగా ఆర్టీసీలో జాయిన్ అవ్వాలని నిరుద్యోగులు అంత ప్రతి రోజు డిపోకు వెళ్తున్నారు. 

            

సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించడంతో నిరుద్యోగులు అంత ఆర్టీసీ డిపో వద్దకు వచ్చి నిరసన తెలియచేస్తున్నారు. ఇటు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చెయ్యమని కార్మికులు కోరుతుంటే అసలు ఉద్యోగమే లేని వారు మాకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి గవర్నమెంట్ ఏ అక్కర్ లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.   

                        

మరింత సమాచారం తెలుసుకోండి: