భారత వాయుసేనలో యుద్ధ విమానాలు  మిగతా దేశాల యుద్ధ విమానాలతో పోలిస్తే  పాతబడిపోయాయి . దీంతో కేంద్రం కొత్త యుద్ధ విమానాలను వాయుసేనలోకి  రఫెల్ యుద్ద విమానాన్ని ప్రవేశపెట్టి  మరింత పటిష్టం చేసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా వాయుసేనలోకి   రఫెల్ యుద్ధ విమానాన్ని తీసుకొచ్చారు. ఫ్రాన్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రఫెల్ యుద్ధ విమానాన్ని అధికారికంగా స్వీకరించారు. 2022 కల్లా మొత్తం 36 విమానాలు భారత్ వాయుసేనలోకి రానున్నాయి  . ప్రస్తుతం భారత వాయుసేన లో ఉన్న ఇంగ్లాండ్  నుంచి అందుకున్న  జాగ్వార్ ఉన్నప్పటికీ ఆధునిక యుద్ధ విమానాలతో పోలిస్తే వాటి సామర్ధ్యం చాలా తక్కువ . మరోవైపు చైనా పాక్ లు అధునాతన యుద్ధ విమానాలు ఉండడంతో... భారత సేనను కూడా బలోపేతం చేసి పొరుగు దేశాలపై ఆధిపత్యం సాదించేందుకు కేంద్రం  నిర్ణయుంచింది. 

 

 

 

 

 పాకిస్తాన్ పై  యుద్ధం ఎప్పుడు ఎలా   వస్తుందో తెలియదు కాబట్టి పాక్ పైనే కాకుండా ఇతర పొరుగు దేశాలతో ఇలాంటి యుద్ధం ఏర్పడిన  ఆధిపత్యం సాధించి దీటైన  సమాధానం ఇవ్వడానికి రఫెల్ యుద్ధ విమానాన్ని వాయుసేన లోకి  ప్రవేశపెట్టింది కేంద్రం . ఇందులో భాగంగానే ఫ్రాన్స్ కి  చెందిన డసో  సోవియట్  సంస్థతో  మొత్తం 36 రఫెల్ యుద్ధ  విమానాలు తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత లో ఇప్పటుకె ఉన్న యుద్ధ  విమానాలతో పోలిస్తే... ప్రస్తుతం రఫెల్ కి చాలా ప్రత్యేకతలు  ఉన్నాయి . రెండు ఇంజన్లు కలిగి ఉండేలా రఫెల్ రూపొందించబడిన  యుద్ధ విమానం... యుద్ధంలో కీలకపాత్ర పోషించి  శత్రువులను మట్టుబెట్టగలదు . కచ్చితమైన లక్ష్యంతో దాడి చేయగల రఫెల్ యుద్ధ విమానం లో ఎలాంటి ఆయుధాలు అయినా అమర్చుకోవచ్చు. 

 

 

 

 

 శత్రువుల పై ధీటుగా దాడి చేయడంతో పాటు శత్రువుల దాడి చేస్తే తట్టుకోగల శక్తి సామర్థ్యం రఫెల్ కి  ఉంటుంది. అయితే  ఫాన్స్, ఈజిప్టు  దేశాల్లో వినియోగిస్తున్న రఫెల్ యుద్ధ విమానాలు... వివిధ ఉగ్ర శిబిరాలపై  మెరుపు  దాడులు కూడా చేసాయి  . శత్రువుల గుర్తించి    సమాచారాన్ని వాసుసేనకి అందించ గల సామర్ధ్యం రఫెల్ యుద్ధ విమానాలకు  ఉంది. ఇప్పటికే  పాక్ చేతిలో ఎఫ్ 16 యుద్ధ విమానాలు ఉండగా రఫెల్  రాకతో భారత వాయుసేన అధిపత్యం  సాధించింది . ఏదేమైనా రఫెల్ రాకతో భారత వాయుసేన మరింత పటిష్టం అయిందనే  చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: