రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం సజావుగా సాగుతున్నందుకుగాను మన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షన్ని వ్యక్తపరిచారు. భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని మంగళవారం నాడు స్వీకరించిన పిదప వారు మాట్లాడుతూ నిర్ణయించుకున్న ప్రణాళికల కనుగుణంగా రఫేల్ యుద్ధ విమానం మన దేశానికి అందించడం పై సంతోషిస్తున్నారు. భారత వాయు సేనకు ఈ యుద్ధ విమానం వల్ల అధిక బలం చేకూరుతుందని...,,, భారత్, ఫ్రాన్స్ పెద్ద ప్రజాస్వామిక దేశాలని..,,, ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లోనూ సహకారం మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తెలిపారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో నేడు శుభ దినమని..,, రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించడం ఎంతో ఆసక్తిగా ఉందని తెలిపారు.

రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత రక్షణా మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ గారు రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్ పట్టణ సమీపంలో ని మెరినాక్ వద్ద డసాల్ట్ ఏవియేషన్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని వారు స్వీకరించడం..,, ఈ విమానానికి శస్త్ర పూజలు నిర్వహించి... విమానంపై ‘ఓం’కారం రాశి.., కొబ్బరికాయ కొట్టి, పూలు వేయడమే కాకుండా విమానం టైర్ల క్రింద నిమ్మకాయలను కూడా ఉంచారు. దాని అనంతరం డసాల్ట్ ఏవియేషన్ హెడ్ టెస్ట్ పైలట్ ఫిలిప్ (విమాన పైలట్) ఆధ్వర్యంలో పయనమయ్యారు.

యుద్ధ విమాన ప్రయాణం విజయవంతంగా ముగిసిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ తన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, హాయిగా ఉందని.. మునుపేప్పుడు లేని క్షణాలని, తనకు యుద్ధ విమానంలో సూపర్‌సానిక్ స్పీడ్‌తో ప్రయాణించేటువంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.

ఈక్షణాల్ని మన రక్షణా శాఖ మంత్రి జీవితంలో గుర్తుండి పోయే క్షణాలు గా చెప్పుకొని సంబర పడ్డారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: