తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ , సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయస్థానం  ముందు నిలబడే అవకాశాలు ఎంతమాత్రం లేవా?  అంటే అవుననే  బీజేపీ ఎమ్మెల్సీ ,  ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు  అంటున్నారు. కేసీఆర్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలను న్యాయస్థానం  ఇప్పటికే పలుమార్లు తప్పు పట్టి మొట్టికాయలు వేసిందని , ఈ నిర్ణయం కూడా కోర్టు ముందు నిలబడే అవకాశమే లేదని  ఆయన విస్పష్టం చేశారు .  తమ న్యాయమైన డిమాండ్లను  పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

అయితే సమ్మె చట్ట విరుద్ధమని సమ్మెకు వెళ్లిన వారిని విధుల్లో నుంచి తొలగిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, అన్నంత పని చేసింది.  కార్మిక చట్టాల ప్రకారం  సమ్మె చేస్తున్న కార్మికులను  విధుల్లో నుంచి తొలగించడం అన్నది చట్టవిరుద్ధమని ఎమ్మెల్సీ రామచంద్రరావు అంటున్నారు.   చట్ట ప్రకారం సమ్మె చేసుకునే హక్కు కార్మికులకు , చట్టమే  కల్పించడం జరిగిందని పేర్కొన్నారు .  సమ్మె చేస్తున్న కార్మికుల చేత ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరపాలని  కానీ సస్పెండ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  సమ్మె చేస్తున్న కార్మికుల చేత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే  చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 

విపక్షాల వాదన ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాదాపు  48  వేల మందిపైగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది .  విధుల్లో  నుంచి తొలగించిన కార్మికుల స్థానంలో కొత్త వారిని నియామకం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది.  దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఒక రకమైన ఆందోళన నెలకొంది



మరింత సమాచారం తెలుసుకోండి: