ప్రైవేటు రవాణా వ్యవస్థ వల్లే తెలంగాణ ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్సీ,  ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ అన్నారు.  ప్రైవేటీకరణ ద్వారా ఆర్టీసీ పునర్వైభవం తెస్తామన్న ముఖ్యమంత్రి  కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు . ప్రైవేటీకరణ ద్వారా ఆర్టీసీకి పునర్వైభవం ఎలా తెస్తారని  ఆయన ప్రశ్నించారు.  ఆంధ్రా బస్సుల వల్ల తెలంగాణ ఆర్టీసీ కి  నష్టం జరుగుతోందని గతం లో  కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా  ప్రస్తావించిన నాగేశ్వర్,  తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రైవేటు బస్సుల సంఖ్య మరింత పెరిగిందని అన్నారు .  కొన్ని రూట్లలో ప్రైవేటు వాహనాలు అధికారికంగా నడుస్తుంటే ... మరికొన్ని రూట్లలో అనధికారికంగా నడుస్తున్నాయని చెప్పారు .

అనధికారికంగా నడుస్తోన్న ప్రయివేట్ వాహనాలపై  రాష్ట్ర ప్రభుత్వం  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నాగేశ్వర్ ప్రశ్నించారు.  ఆంధ్రా లోని విజయవాడ తో సహా  ఇతర ప్రాంతాలకు ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయని కానీ తెలంగాణలోని పల్లెల్లోకి ఎందుకు నడవడం లేదో  చెప్పాలంటూ నాగేశ్వర్  డిమాండ్ చేశారు .  హైదరాబాద్,  విజయవాడ , హైదరాబాద్ బెంగుళూరు వంటి లాభాల రూట్ లోనే ప్రైవేటు బస్సులు నడుపుతూ , ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్నారన్నారు  . 20 శాతం ప్రైవేటు బస్సులకు ప్రభుత్వం అనుమతిస్తే ఆర్టీసీ ఆదాయానికి మరింతగా పడుతుందని చెప్పారు . ఆర్టీసీ వేల కోట్లు నష్టపోతుందన్న ఆయన, ఇప్పటికే  20 శాతానికి బదులు అనధికారికంగా 30 శాతం ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని తెలిపారు . 

టూరిస్ట్ క్యారియర్ గా  అనుమతులు పొందిన ప్రయివేట్ బస్సుల యజమానులు  స్టేజి క్యారియర్ గా ఎక్కడపడితే,  అక్కడ బస్సులు ఆపి ఆర్టీసీకి రావాల్సిన ఆదాయానికి దండుకుంటున్న  ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు చెప్పాలని డిమాండ్ చేశారు .  ప్రైవేట్ ట్రావెల్స్ కి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తామని చెప్పాడని  కూడా నాగేశ్వర్ తప్పుపడుతూ ,  ఆ సబ్సిడీ ఎదో ఆర్టీసీకి  ఇస్తే సరిపోతుందని కదా ... అప్పుడు ఆర్టీసీ లాభాల బాట పడుతుందని అన్నారు . 



మరింత సమాచారం తెలుసుకోండి: