పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఢిల్లీ హై కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పోలవరం నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఢిల్లీ హై కోర్టు కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించాలంటూ కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది. దాంతో అటు కేంద్రప్రభుత్వానికి ఇటు చంద్రబాబునాయుడుకు ఒకేసారి షాక్ తగిలినట్లైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి అనుమానించారు. అందుకనే అవినీతి జరిగిన విషయమై అధ్యయనం చేయాలంటూ ఓ నిపుణుల కమిటిని కూడా వేశారు. ఎప్పుడైతే నిపుణుల కమిటి వేశారో వెంటనే ఇటు చంద్రబాబు అటు బిజెపి నేతలు జగన్ తప్పు పడుతూ మండిపోతున్నారు.

 

సరే ఎవరి గోల ఎలాగున్నా నిపుణుల కమిటి అధ్యయనం చేసి సుమారు రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. నిపుణుల కమిటి అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేసి విచారణ కోరాలని జగన్ అనుకుంటున్నారు. ఈలోగానే చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని బిజెపి నేతలు జగన్ కు వ్యతిరేకంగా ఒకటే గోల మొదలుపెట్టారు. అలాగే ఈమధ్యనే టిడిపి నుండి బిజెపిలో ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా జగన్ ను తప్పుపడుతున్నారు.

 

మొన్నటి ఎన్నికల సమయంలో ఇదే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకుంటున్నారని స్వయంగా నరేంద్రమోడినే కామెంట్ చేసిన విషయాన్ని స్ధానిక బిజెసి నేతలు మరచిపోయినట్లు నటిస్తున్నారు. ఈ గోల ఇలా వుండగానే పెంటపాటి పుల్లారావు అనే సామాజిక ఉద్యమ నేత ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ హై కోర్టులో ఓ పిటీషన్ వేశారు.

 

ఈయన పోలవరం పునరావాసం తదితర విషయాలపై చాలా కాలంగా పోరాడుతున్నారు. అందుకనే పటీషన్ ను పరిశీలించిన హై కోర్టు పోలవరం అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలంటూ కేంద్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఎప్పుడైతే హై కోర్టు ఆదేశాలు వెలువడ్డాయో వెంటనే కేంద్రంలోను, రాష్ట్రంలోను రాజకీయ వేడి మొదలైపోయింది. మరి కేంద్రం పోలవరం అవినీతిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: