తెలంగాణలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక రోజు రోజుకీ టెన్షన్ పెరిగిపోతుంది.  ఈ ఎన్నిక అధికార పార్టీకి ప్రతి ష్టాత్మకంగా మారగా..ప్రతిపక్ష పార్టీ తమ సత్తా చూపేందుకు మరో ప్రయత్నం చేస్తుంది.  వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ గెలిచారు.  ఆయన రాజీనామ చేసిన విషయం తెలిసిందే. కాగా, మొత్తం 76 మంది నామినేషన్‌ వేయగా అందులో 45 మంది అభ్యర్ధుల పత్రాలు సరిగా లేవంటూ నామినేషన్లు తిరస్కరించింది ఈసీ. దీంతో 31 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 

తాజాగా మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్‌ను ఉపసంహరించున్నారు. ఫైనల్‌గా 28 మంది అభ్యర్ధులు తుదిపోరులో నిలిచారు.  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆటో, ట్రక్కు గుర్తులను డిలిట్ చేస్తూ నోటీసు బోర్డులో ఉంచారు. మొత్తం 70 నుంచి 80 గుర్తులను డిస్ ప్లే చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈసారి అధికార పార్టీకి సీపీఐ మద్దతు ప్రకటించింది. టీజేఎస్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి.  ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ఈ నెల 13 నుంచి 18వరకు హుజూర్ నగర్ లో పర్యటించనున్నారు.

ప్రచార సమయంలో నిజయోజకవర్గం పరిధిలో రోడ్‌షోలు, బహిరంగ సభలు ఏర్పాటుచేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరుపున ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  భార్య పద్మావతి రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నెల 21 పోలింగ్..24న ఫలితాలు రానున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ పోటీ మాత్రం టీఆర్ఎస్-కాంగ్రెస్ మద్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: