ఉల్లి లేనిదే అసలు కూర లేదు ఒక వేళ ఉన్నా దానంత రుచి లేనే లేదు.దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఉల్లిపాయల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నేతృత్వంలోని ఎంఎంటీసీ కంపెనీ టెండర్లు కూడా ఆహ్వానించింది.

ఉల్లి కొరత తీవ్రంగా ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లిధర కిలో రూ.80 వరకు పలుకుతోంది. పండుగల సీజన్ కావడంతో పాటు ఈ నెల చివరి వారంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.కానీ ఇంత రేట్ ఉంటే అసలు ఎలా వంట వాండాలి,ఎలా తినాలి అంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు.కానీ ఇలానే ఉల్లి రేట్లు ఉంటే ఇంక బతకడం కష్టం అంటు ఇటు సామాన్య ప్రజలు అటు వ్యాపార వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నారు.మునుపెన్నడు ఇలాంటి ఘోరమైన ధరను చూడలేదు అంటూ కూడా గగ్గోలు పెడుతున్నారు ప్రజానీకం.

ఇది ఇలా ఉంటే అసలు ఈ ఉల్లి ధరలు తగ్గుతాయా,తగ్గవా ఏమవుతుందో ఈ రాష్ట్రంలో అంటూ కొందరు సెటైర్ల వర్షం కూడా కురిపిస్తున్నారు.బంగారం ధరకు ఉల్లి చేరుకుంటే ఇంక పెళ్లికి కట్నాల రూపం లో కిలో ఉల్లిని బహుమానంగా ఇచ్చే స్థాయికి ఉల్లి ఎదగకుండా కాపాడుకొనే బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది అంటున్నారు అధికారులు సైతం.ఇక ఉల్లి పరిస్థితి ఆ భగవంతుడికే వదిలేసి ఆకాశం లో దీపం పెట్టి ఉల్లి తగ్గాలని ఎదురుచూడటమేనా లేక ఏదైనా మ్యాజిక్ జరుగనుందా అనే అంశం మీద ఆధారపడి ఉంది. ఉల్లి నీకో దండం తల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: