మూసీ నది అనేది హైద్రాబాద్ ని కాపాడే అత్యంత ముఖ్యమైన నది హైదరాబాద్ ప్రజల చెడు నీటిని మోస్తున్న గొప్ప నది.ఆ మూసి లేకుంటే హైదరాబాద్ నగరం లేదు.

భారీవర్షాలు వచ్చినప్పుడు వరదలకు మూసి పాడైపోతే అమాంతం హైద్రాబాద్ నీటిలో మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ట్యాంక్ బండ్ లో కూడా కొంత నీరు మూసి నదికి అనుసందానమై ఇప్పుడు ట్యాంక్ బండ్ మొత్తం కలుషితం అయి హైద్రాబాద్ మొత్తం కూడా నాశనం అయ్యే స్థితి కూడా ఉంది.దీని పై ప్రభుత్వం త్వరగా  స్పందించి మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది.ఈ మధ్య కురిసిన అతి భారీ వర్షానికి యావత్తు మూసీ నది కట్టలు తెంచుకొనేంత స్థాయికి చేరుకుంది. అత్యంత కలుషిత నీరు గల ఈ నది పొంగితే మొత్తం భాగ్యనగరానికే పెద్ద ముప్పు అంటున్నారు...అక్కడి వాసులు..

మూసీ ప్రాజెక్టు గేటు నుంచి ఐదు రోజులుగా నీటి లీకేజీ కొనసాగుతోంది. 644.80 అడుగుల పూర్తి సామర్థ్యం నుంచి 625 అడుగులకు మూసీ నీటిమట్టం పడిపోయింది. 4.46 టీఎంసీల సామర్థ్యమున్న మూసీ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 3.2 టీఎంసీల నీరు వృధా అవుతోంది. మూసీకి హైదరాబాద్ నుంచి 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో మూసీ ఆయకట్టు రైతులు అయోమయంలో ఉన్నారు.పొరపాటున మూసి ఉప్పొంగితే కలిగే ఈ ప్రమాదానికి ఏమి జరగనుందో..? ఎలాంటి ప్రమాదం రానుందో అని అందరికి లబ్..డబ్ అంటుంది.చూద్దాం మూసీ ముసుకుంటుందా లేక మీసం మెలేసి ఎగిరి పొంగి జనం పాలిట శాపం అవ్వనుందా అనే అంశాల మీద ప్రస్తుతం ఈ టాపిక్ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: