తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. ఆర్టీసీ కార్మికులపై సంచలన నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఇప్పటివరకు చాలా కాన్ఫిడెంట్ గా తన నిర్ణయం మీద నిలబడిన కేసీఆర్ కూడా వెనక్కు తగ్గే పరిస్థితి ఎదురైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థకు చెందిన ఇష్యూ కాస్తా రాష్ట్రంలోని మిగిలిన సంఘాల యూనియన్లు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్లను సైతం రంగంలోకి దిగాలా చేసింది.

ఇప్పటికే కేసిఆర్ ట్రేడ్ యూనియన్లు రద్దు చేస్తున్నట్లు... ఆర్టీసీలో కొత్తగా చేరే ఉద్యోగులు కూడా ఎటువంటి యూనియన్లలో చేరబోమంటూ లేఖ రాసి ఇవ్వాలని కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. కావున రాష్ట్రం నుండి.... దేశం నలుమూలల నుండి వచ్చిన యూనియన్లంతా ఊహించని రీతిలో అతని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ భవన్ ముందు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ యూనియన్, ఎఐటియుసి నేతలు ధర్నాకు దిగారు. సస్పెండ్ చేసిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అరెస్టయిన యూనియన్ నాయకులను కూడా విడుదల చేయాలని అల్టిమేటం విధించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల మద్దతు తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోకపోగా వారిని ఉద్యోగాల నుండే తొలగించే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. తక్షణమే దీనిపై కేసీఆర్ స్పందించి బర్తరఫ్ చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు వారికి మద్దతుగా ధర్నాకు దిగుతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ ఎదుట నిరసన చేసేవరకు ఈ విషయం వెళ్లడం చూస్తే కెసిఆర్ కూడా ఇంత ఒత్తిడిని తట్టుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఆయన కనుక సస్పెన్షన్ ని ఉపసంహరించుకో పోతే తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అతనికి కూడా తెలుసు. ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: