వైఎస్ మానస పుత్రిక అనిపించుకున్న ఆరోగ్యశ్రీ పేదలకూ పెద్ద వైద్యం లబించేలాగా చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఓ సంచలనాత్మక నిర్ణయం. 2007లో మహానేత ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ తొలుత 3 జిల్లాల్లో 163 వ్యాధులకు చికిత్స అందించేలా చేశారు. రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు అందరికి. కేన్సర్, గుండె జబ్బులు,న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు.


 చిన్నారుల్లో వినికిడి లోపాలను సవరించేందుకు కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కోసం ఒక్కొక్కరికీ 6.5 లక్షలు వెచ్చించిన ఘనత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానిదే. ఏటా బడ్జెట్ లో ఆరోగ్య శ్రీ పథకం కోసం 925 కోట్ల రూపాయిలు కేటాయించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో 375 కోట్లు కూడా అందించి మొత్తం 1,400 కోట్లు రూపాయలు  పథకానికి కేటాయించారు. పేదల ఆరోగ్యం పట్ల ఇంతటి శ్రద్ధ చూపిన పాలకుడు ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే లేడు.


 ఆరోగ్యశ్రీ  పథకానికి పెద్ద ఎత్తున లభించిన స్పందన చూసిన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. పేదరికంవల్ల చికిత్స అందక ఏ ఒక్కరూ మరణించకూడదన్న మహానాయకుడి సంకల్పమే ఆరోగ్యశ్రీగా ఎందరో అభాగ్యులకు ఆయువు పోసింది. డాక్టర్ గా ఎందరికో ప్రాణదానం చేసిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరెందరో పేదల ప్రాణాలకు కొండంత అండై నిలిచాడు.


డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును తెలుసుకునేందుకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున ప్రకటించారు. ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా చేపట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిర్ణీత సమయంలో 0863–234166కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పవచ్చని మల్లిఖార్జున తెలియచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: