మన దేశంలోనే అత్యంత ధనికుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీ స్థాపించిన డిజిటల్ నెట్వర్క్ సంస్థ రిలయన్స్ జియో వచ్చిన కొత్తల్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. వచ్చిన కొత్తల్లో తమ వినియోగదారులకు ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా ను గిఫ్ట్ గా ఇచ్చిన ఈ సంస్థ దెబ్బకు అన్ని మొబైల్ కంపెనీలు తక్కువ రేట్ కి సర్వీసులు ఇచ్చేందుకు దిగి వచ్చిన సంగతీ తెలిసిందే. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఉచితంగా సర్వీసులు అందించిన జియో తర్వాత అందరితో కలిసి దేశం ఎన్నడూ చూడని విధంగా తక్కువ రేట్లకే కాల్స్ మరియు డేటా సర్వీసులను అందించింది.

కానీ ఇప్పుడు అక్టోబరు 10 వ తారీఖు నుండి జియో సిమ్ నుండి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ వినియోగదారులకు కాల్ చేయాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించక తప్పదు. దీనిని ఐ.యూ.సీ చార్జీ కింద జియో వసూలు చేస్తున్నట్లు తెలిపింది. అంటే జియో సిమ్ ఉన్న వినియోగదారుల కాకుండా ఇతర వినియోగదారులతో మనం కాల్ మాట్లాడాలంటే తప్పక డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నీ జియో సిమ్ నుండి జియో సిమ్ కు చేసే కాల్స్ మాత్రం ఉచితంగానే లభించనున్నాయి. అలాగే ఇన్కమింగ్ కాల్స్ మరియు వాట్స్అప్ కాల్స్ మాత్రం ఉచితంగానే లభించనున్నాయి.

కొత్తగా విడుదల చేసిన జియో ఐ.యూ.సీ ప్లాన్స్ ఇవే
10 రూపాయలు ప్లాన్ పై124 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 1GB డేటా ఉచితం
20 రూపాయల ప్లాన్ పై 249 నిమిషాల ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 2GB డేటా ఉచితం
50 రూపాయలు ప్లాన్ పై 656 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 5GB డేటా ఉచితం
వంద రూపాయలు ప్లాన్ పై 1,362 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడచ్చు మరియు 10GB డేటా ఉచితం


మరింత సమాచారం తెలుసుకోండి: