రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఐదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రభుత్వం, మీరు దిగొచ్చే వరుకు మేము సమ్మె అపమూ అన్నట్టు ఆర్టీసీ కార్మికులు ప్రవర్తిస్తున్నారు. వీరి ఇద్దరి మధ్య ప్రయాణికులు నలిగిపోతున్నారు. పండగ వేళ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేల చేశారు. 

                                  

దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పలు ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. వారు కేసీఆర్ తీరు మార్చుకోవాలని, ఆర్టీసీని తెలంగాణలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ నేను రాజు నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. 

                          

ఆరు సంవత్సరాలలో ఆరు వేళా మంది పదవి విరమణ చేశారని, గత 6 సంవత్సరాలుగా ఆర్టీసీలో ఒక్క నియామకం కూడా జరగలేదని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. కాగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో జగన్ ఆర్టీసీని విలీనం చెయ్యలేదా అని అయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై నిందలు మోపి కేసీఆర్ తప్పించుకుంటున్నాడూ అని వ్యాఖ్యానించారు. 

                      

ఉద్యోగులను బజారుపాలు చేసేందుకు తెలంగాణ తెచ్చుకోలేదు అని ఇది దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణ అని చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: