పోల‌వ‌రం ప్రాజెక్టు ఇప్పుడు కోర్టుల చిక్కుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డేదెన్న‌డో ఎవ్వ‌రికి అంతు చిక్కకుండా పోయింది. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయిన‌ప్ప‌టికి ఏపీ ప్ర‌భుత్వం దాన్ని టేకోవ‌ర్ చేసి అక్ర‌మాల గ‌నిగా మార్చి ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారిన పోల‌వరంకు రాజ‌కీయ రంగు పులిమారు. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు పోల‌వ‌రం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతుందా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏకంగా పోల‌వ‌రంలో అవినీతిని వెలికితీయండి అంటూ తీర్పు ఇవ్వ‌డంతో పోల‌వ‌రంలో రాజ‌కీయ అవినీతి కూక‌టివేళ్ళ‌తో బ‌య‌టికి రానున్న‌దా.. అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.  


ప్రముఖ సామాజికవేత్త, ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పోలవరం అవినీతిపై  ఓ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా  అవినీతి జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని నిర్మాణంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్ర జలవనరుల శాఖ ఈ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని సూచించింది.


ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై పిటిషనర్ పెంటపాటి పుల్లారావు స్పందిస్తూ.. న్యాయస్ధానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన వెల్లడించారు.
వాస్త‌వానికి ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలోనే పోల‌వ‌రం ను కేంద్ర ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం లో భాగ‌స్వామ్య‌మైన టీడీపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టును టోకోవ‌ర్  చేసింది. పోల‌వ‌రంకు కేంద్రం నిధులు ఇవ్వ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌డం జ‌రుతుండేది. అయితే కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఈ ప్రాజెక్టు చేప‌డితే ఇంత‌లా అవినీతి జ‌రిగేది కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.


ఇప్పుడు కోర్టు కూడా కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అప్ప‌గించింది. అంటే జాతీయ ప్రాజెక్టులో జ‌రుగుతున్న అవినీతిని కేంద్ర ప్ర‌భుత్వ‌మే విచార‌ణ చేయాల‌ని కోర్టు తీర్పు ఇవ్వ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాఫీక్‌గా మారింది. ఇక ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్ పోల‌వ‌రంలో జ‌రిగిన అవినీతిని త‌గ్గించే క్ర‌మంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ చేపట్టి దాదాపు రూ.800 కోట్లు మిగిల్చింది. న‌వంబ‌ర్ నెల‌లో ప్రారంభం కావాల్సిన ప‌నులు ఇప్పుడు కోర్టు ఆదేశాల‌తో విచార‌ణ పూర్తి అయిన త‌రువాతే ప‌నులు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: