దేశంలోనే ఎక్కువ మొత్తంలో వినియోగదారులు కలిగి ఉన్న బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ తన వినియోగదారుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వినియోగదారులకు మెరుగైన బ్యాంక్ సేవలు అందజేస్తూ ఎక్కువ వినియోగదారులు కలిగిన బ్యాంకుగా  అగ్రస్థానంలో ఉంది ఎస్బిఐ . కాగా  ఎస్బిఐ వినియోగదారుల కోసం దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంది . ఇక తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీపావళి పండుగ గురించి వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్  అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఎస్బిఐ. 

 

 

 

 

 

 

 ఆర్బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన కొన్ని రోజుల్లోనే ఎస్బిఐ ఎంసిఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లకు తగ్గించింది ఎస్బిఐ . ఈ నిర్ణయంతో ఎస్బిఐ వినియోగదారులకు మేలు చేకూరుతుంది. సామాన్య పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజుల నుండి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎదురుచూస్తున్న సామాన్య ప్రజల ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. అతి తక్కువ వడ్డీ రేటు తో ఎస్బిఐ అందిస్తున్న గృహ రుణాలు తీసుకొని సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తుంది ఎస్బిఐ. 

 

 

 

 

 

 ఎస్బిఐ ఎంసీఎల్ఆర్  10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బ్యాంక్ వార్షిక ఎంసిఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గింది. దీంతో  గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఎస్బీఐ వినియోగదారులకు మేలు చేకూరుతుంది. కాక ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఎంసీఎల్ఆర్ ను  ఆరుసార్లు తగ్గించడం విశేషం. ఎంసిఎల్ఆర్ అనుసంధానించబడిన అన్ని  వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గనున్నట్లు  ఎస్బిఐ అధికారులు వెల్లడించారు. కొత్త  ఖాతాదారులకు కూడా రెపో రేటు అనుసంధానిత గృహ రుణాలను అందిస్తోంది దీనివల్ల మార్కెట్ రేటును సవరించిన ప్రతిసారి రుణ వడ్డీ రేటు కూడా మారుతూ వస్తుండడం గమనార్హం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతోనే పండగ వేళ ఈ నిర్ణయం  తీసుకున్నామని ఎస్బిఐ  అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: