తీసుకునే ఆహరం ఎంతటి పవిత్రమైనదో చెప్పక్కర్లేదు.  పవిత్రమైన ఆహారాన్ని పవిత్రంగా చూడాలి.  అలా పవిత్రంగా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే.. చివరకు అన్నం దొరకదు.  ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నా గాని, దానిని పట్టించుకోకుండా అలానే చేస్తుంటారు.  అయితే, అలాంటి వ్యక్తులు జీవితంలో అనేక ఇబ్బందులు పడుతుంటారు.  మాములుగా తీసుకునే ఆహరంలో అప్పుడప్పుడు తల వెంట్రుకలు వస్తుంటాయి.  అది సహజమే.  ఎందుకంటే.. 


వంట చేసే సమయంలో తెలియకుండానే తలలోని జుట్టు రాలి ఆహారంలో పడుతుంటుంది.  అలా అని అన్నం పారేసుకుంటామా చెప్పండి.  వెంట్రుకను పక్కన పెట్టి ఆహరం తీసుకోవడం లేదు.  హోటల్ లో అయితే వెంట్రుకలేం ఖర్మ బల్లులు వంటివి కూడా వస్తుంటాయి. బయట కాబట్టి సర్దుకుపోతుంటారు.  అదే ఇంట్లో వస్తే.. గయ్ మని లేచి పెద్ద రాద్ధాంతం చేస్తారు.  అంతేకాదు, రాద్ధాంతం చేయడమే కాదు.. కొట్లాటకు దిగుతారు కూడా.  


ఇలానే ఓ వ్యక్తి కొట్లాటకు దిగాడు... అక్కడితో ఆగకుండా అన్నం వండిన భార్యకు గుండు కొట్టాడు.  అప్పటిగాని అతని కోపం తగ్గలేదు.  గుండు కొట్టడంతో అతని కోపం ఎంతవరకు తగ్గిందో తెలియదుగాని, ఆ వ్యక్తికీ మాత్రం జైలు శిక్ష పడింది.  జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.  కారణం ఏంటి.. అంటే దానికి ఓ కారణం ఉంది. మాములుగా గడవకు గపడవ పడితే పర్వాలేదు.. కానీ, ఆ వ్యక్తి భార్యతో గొడవపడటమే కాకుండా.. బ్లేడ్ తీసుకొచ్చి బలవంతంగా గుండుకొట్టించాడు.  


ఆమె లబోదిబో అని పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వచ్చి ఆ వ్యక్తిని చెడామడా తిట్టారు.  అక్కడితో ఆగకుండా, సదరు వ్యక్తిపై స్థానిక మానవహక్కుల సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వాపోవడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.  ప్రస్తుతం కేసు విచారంలో ఉన్నది.  ఒకవేళ విచారణ నిరూపణ జరిగితే.. సదరు వ్యక్తికీ ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది.  మహిళల విషయంలో చట్టాలు కఠినంగా ఉన్నా.. అక్కడ చట్టాలు పెద్దగా అమలు కావడం లేదు.  ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు.  మనదగ్గర కాదులెండి.  బాంగ్లాదేశ్ లో జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: