ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా రవాణా జరుగుతుంది అనే విషయం మనకు తెలుసు.  ప్రజా రవాణాలో ప్రముఖ పాత్ర పోషించేవి రైలు వ్యవస్థ.  ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది.  అందుకే రైల్వే వ్యవస్థను ఎంచుకుంటూ ఉంటారు.  దేశంలో అనేక ప్రాంతాలకు రైల్వేలు నడుస్తుంటాయి.  కొన్ని దేశాల్లో ఒక దేశం నుంచి మరో దేశానికీ రైలు మార్గం కూడా ఉంటుంది.  ఉదాహరణకు ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య, యూరప్ దేశాలల్లోనూ ఇలాంటి రైల్వే వ్యవస్థలు ఉంటాయి.  


సముద్రాలూ దాటి వెళ్ళాలి అంటే విమానంలో వెళ్ళాలి లేదంటే.. షిప్ లో వెళ్ళాలి.  దూర ప్రయాణాలకు ఒకప్పుడు మాత్రమే షిప్ లు అందుబాటులో ఉండేవి.  కానీ, ఇప్పుడు అలా కాదు.. ఇప్పుడు ఆంతా విమానాల్లోనే ప్రయాణం.  రాకెట్ యుగం ప్రారంభం అయ్యాక.. విమానాల్లో ప్రయాణాలు పెరిగిపోయాయి.  సకల సౌకర్యాలతో కూడిన విమానాలు అందుబాటులో ఉన్నాయి.  ఇదిలా ఉంటె, విమానాల సంగతిని పక్కన పెడితే.. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వరకు రైల్ ఉందంట.  


పాపం ఆ విషయం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ రైల్వే అధికారులకు తెలియదు.  అసలు పాకిస్తాన్ నుంచి అమెరికా దాక ఎవరు రైలు పట్టాలు వేశారో కూడా తెలియదు.  కరాచీలోని రైల్వే స్టేషన్లోని ఓ రైల్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ తెరపై కరాచీ టు లాస్ ఏంజిల్స్ అని డిస్ప్లే అయ్యింది.  వెంటనే ఆ రైల్ ఎక్కిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.  ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డారు.  వెళ్తుంది గమ్యస్థానాలకా లేదంటే లాస్ ఏంజిల్స్ వరకు వెళ్తుందా అని షాక్ అయ్యారు.  


విషయం ఏమిటంటే.. లాస్ ఏంజిల్స్ అనే పేరు రాంగ్ గా డిస్ప్లే అయ్యిందట. అలా డిస్ప్లే కావడంతో పాపం అధికారులు వెంటనే గుర్తించి సరిచేశారు.  అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది.  చాలామంది యువకులు ఆ రైలుపై ఉన్న డిస్ప్లే అయిన దృశ్యాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  పాకిస్తాన్ చాల డెవలప్ అయ్యింది.  ఎంతగా అంటే.. కరాచీ నుంచి ఏకంగా లాస్ ఏంజిల్స్ వరకు రైలు వేసేంతగా డెవలప్ అయ్యింది.  సముద్రంలో సైతం పాక్ రైళ్లు ప్రయాణం చేయగలవు అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇవి ఇప్పుడు వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: