దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసుల పర్వం కొనసాగుతోంది. ఈనెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు సబ్ జైలుకు తరలించారు పోలీసులు. సుమారు మరో 20 కేసులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో.. చింతమనేని ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. 


దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గడిచిన 15 ఏళ్లలో 66 కేసులు నమోదయ్యాయి. అందులో  25కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెదపాడు, పెదవేగి పోలీస్ స్టేషన్ లలో నమోదైన ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న చింతమనేని.. ఏలూర్ సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి ప్రభాకర్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. గత ఏడాది దెందులూరు పరిధిలో అక్రమమట్టి త్రవ్వకాలు జరుగుతుండగా అడ్డుకున్న విజిలెన్స్ అధికారులపై అనుచరులతో కలిసి దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలో నమోదైన కేసులో చింతమనేనిని అరెస్ట్ చేశారు. పోలీసులు న్యాయమూర్తిని కోరడంతో అక్టోబర్ 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దెందులూరులో విజిలెన్స్ అధికారులు పై దాడి కేసు తో పాటు మరిన్ని కేసుల్లో పోలీసులు లు ప్రభాకర్ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 


విజిలెన్స్ అధికారుల్ని అడ్డుకున్న కేసులో చింతమనేనితో పాటు ఆయన అనచరుల్ని కూడా ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. వీరికి కూడా ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అడ్డుకున్న విజిలెన్స్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే, ఆరోపణలో నమోదైన కేసులో పిటి వారెంట్ పై ప్రభాకర్ అనుచరులు ఎమ్.ఏలియా, చింతమనేని సతీష్, రాజేష్, ఇ.శ్రీనివాస్, ఎస్.దిలీప్, ఎమ్.అప్పారావులను కూడా ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా వీరికి 14 రోజులు ఈనెల 23 వరకు రిమెండ్ విధించింది న్యాయస్థానం



మరింత సమాచారం తెలుసుకోండి: