పోలవరం ప్రాజెక్టు  అవినీతి  విషయంలో విచారణ జరపించాలని ఢిల్లీ హై కోర్టు ఆదేశించటంపై చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైందనే చెప్పాలి. పోలవరంలో అవినీతి జరిగిందని నిపుణుల కమిటి వేసిన జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎన్నిసార్లు తప్పు పట్టారో అందరూ చూసిందే.   

 

తన హయాంలో  జరిగిన అవినీతిపై  జగన్ సమీక్షలు చేయటాన్ని సహించలేకపోతున్నారు. దానికి తగ్గట్లుగా ఎల్లోమీడియా కూడా జగన్ నిర్ణయాలను తప్పుపడుతూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వారుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ హై కోర్టు చంద్రబాబుకు దిమ్మతిరిగే ఆదేశాలిచ్చింది.


పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సామాజిక  ఉద్యమ నేత  పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హై కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు వెంటనే కేంద్రప్రభుత్వానికి ఓ డైరెక్షన్ ఇచ్చింది. పోలవరంలో జరిగిన అవినీతిపై కేంద్ర జలవనరుల శాఖతో వెంటనే విచారణ చేయించమని ఆదేశించింది.

 

హై కోర్టు ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. జరిగిన అవినీతిపై జగన్ మాటనే హై కోర్టు కూడా సపోర్టుగా ఆదేశాలు జారీ చేయటంతో ప్రతిపక్షాలకు మాట పడిపోయింది. ఇప్పటి వరకూ చంద్రబాబుకు మద్దతుగానా అన్నట్లుగా బిజెపి నేతలు కూడా వత్తాసు పలుకుతున్నారు.  

 

జగన్ తీసుకుంటున్న నిర్ణయంతో రాష్ట్రానికి అప్రదిష్ట వస్తోందని ఇప్పటి వరకూ మండిపడుతున్న చంద్రబాబు అండ్ కో హై కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలపై ఏం మాట్లాడుతారో చూడాలి. జగన్ నిర్ణయాలను తప్పు పట్టినట్లుగా హై కోర్టు ఆదేశాలపై అడ్డదిడ్డంగా మాట్లాడే సాహసం చేయగలరా ?

 

పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగటం వాస్తవమని స్వయంగా ప్రధానమంత్రే బహిరంగంగా ఆరోపణలు చేయటం గతంలో ఎక్కడా జరగలేదు. కానీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మోడి ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. సరే మొత్తానికి హై కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలతో పోలవరం డొంకంతా కదిలేట్లుంది చూడబోతే. మరి చంద్రబాబు, రాష్ట్ర బిజెపి నేతలు, ఎల్లోమీడియా ఏమంటారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: