తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సోషల్ మీడియాలో మాంచి డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఇదే సమయంలో అనేక పాత విషయాలు వెలుగు చూస్తున్నాయి. అందులో ఒకటి అసలు తెలంగాణ ఏర్పాటుకు ఆర్టీసీయో కారమట. కెసియార్ తెలంగాణా ఉద్యమం చేయడానికి, సిఎం అవడానికి కూడా పరోక్షంగా ఆర్టీసీనే కారణమట.


ఎందుకంటే.. 1996-1999 చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఇప్పటిలానే అప్పుడు కూడా నవాబుగిరీ వెలిగిస్తూ, ఆఫీసుకి పోకుండా గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు పేరబెట్టాడని కొందరు తమ పోస్టుల్లో చెబుతున్నారు. ఆ సమయంలో ఆకస్మిక తనిఖీకి వెళ్ళిన చంద్రబాబు ఆ ఫైళ్ళ గుట్టలు చూసి కేసీఆర్ మీద ఫైర్ అయ్యారట.


దీనికి సంబంధించిన ఫోటోతో సహా ఆ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చిందట. ఆ వెంటనే 1999 ఎన్నికలొచ్చాయి. వెలమ కులం నుండి విజయరామారావు కూడా గెలిచాడు. కెసియార్ ఎలాగూ అసలు పనిచేయకుండా పొద్దు పుచ్చుతున్నాడన్న కోపంతో చంద్రబాబు కేసీఆర్ కు మంత్రిపదవి ఇవ్వలేదట చంద్రబాబు. కేస్ట్ ఈక్వేషన్ చూపించి పక్కన పెట్టేశాడట.


కెసియార్ సమర్ధుడైన స్ట్రాటజిస్టే కానీ సమర్ధుడైన పనిమంతుడు కాదని ఆ పోస్టుల్లో చెబుతున్నారు. అలా మంత్రిపదవి పోయి, డిప్యూటీ స్పీకర్‌గా ఉండలేక బయటికొచ్చి కేసీఆర్ తెలంగాణా ఉద్యమం ఎత్తుకున్నాడని చెబుతున్నారు. కాబట్టి తప్పంతా రవాణాశాఖదే అని సెటైర్లు పడుతున్నాయి. అసలు అన్ని ఫైళ్ళు ఎవడు పుటప్ చేయమన్నాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.


మరి ఈ విషయంలో ఎంత వరకూ వాస్తవం ఉందో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ పోటోలు, ఫేక్ పోస్టులు చాలా ఎక్కువయ్యాయి. కాబట్టి ఈ పోస్టును అంత సులభంగా నమ్మలేం. దీన్ని ఏ టీడీపీ కార్యకర్తలో, కాంగ్రెస్ కార్యకర్తలో ప్రచారంలోకి తెచ్చినా తెచ్చి ఉండొచ్చు. ఒకవేళ నిజమైనా అయి ఉండొచ్చు. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: