2014 ఎన్నికలలో తెలంగాణలో తెరాస పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.  నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది.  నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కెసిఆర్ కూతురు కవిత భారీ విజయం సాధించింది.  కవిత ఎంపీగా పార్లమెంట్ లో మంచి పోరాటమే చేసింది.  పార్లమెంట్ లో తెరాస పార్టీ తరపున తన వాణిని బలంగా వినిపించింది.  అయితే, నిజామాబాద్ కు లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనీ ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉన్నది.  


ఆ డిమాండ్ ను తెరాస పార్టీ నెరవేర్చలేకపోయింది.  అంతేకాదు రైతుల సమస్యలు చాలా ఉన్నాయి.  ఉద్యమంలో రైతుల పాత్ర చాలా ఉన్నది.  నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో వరిపంట ఎక్కువగా పండుతుంది.  అక్కడ రైతులు ఎక్కువగా ఉన్నారు.  ముఖ్యంగా పసుపురైతులు పసుపును ఎక్కువగా పండిస్తున్నారు.  పసుపుకు సంబంధించిన బోర్డు ను ఏర్పాటు చేయాలని అక్కడి రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా దాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది.  


అదే నిజామాబాద్ లో కవిత ఓటమికి కారణం అయ్యింది.  కవిత ఓడిపోవడం తెరాస పార్టీ జీర్ణించుకోలేపోయింది.  మరోవైపు కెసిఆర్ సొంత మండలంలో స్థానిక సంస్తల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోవడం విశేషం.  ఇదిలా ఉంటె, ఇప్పుడు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్నది.  ఈనెల 21 వ తేదీన ఉపఎన్నిక జరగబోతున్నది.  ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తెరాస పార్టీ లక్ష్యంగా పెట్టుకొని క్యాడర్ మొత్తాన్ని అక్కడ దించింది.  


అయితే, ఈ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనిచెప్పి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  సమ్మె చేయడంతో వారిని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  ఇకపై సమ్మె చేస్తున్న కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింపబడరు అని చెప్పడంతో.. ఈ సమ్మె మరింత పెరిగిపోయింది.  ఇప్పటికే హుజూర్ నగర్లో కొంతమంది సర్పంచ్ లు తెరాస పార్టీకి వ్యతిరేకంగా మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేశారు.  ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తున్న వారిని తొలగించడంతో.. ఆర్టీసీ కార్మికులు హుజూర్ నగర్లో తెరాస పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.  ఇదే జరిగి తెరాస పార్టీకి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తే.. హుజూర్ నగర్ స్థానాన్ని తెరాస పార్టీ తిరిగి ఓడిపోవలసి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: