భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతోన్న సందర్భంలో.. సమాజంలో అట్టడుగున ఉన్నఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం.. అహర్నిశలూ పరితపిస్తూ, శ్రమిస్తోన్న యువ, నవ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్షాల సవాల్లను చిరునవుతో స్వీకరిస్తూ,సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, తనదైన పాలనలో దూసుకెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ చూపిస్తూ..ఎన్నికల హామీలతో పాటూ మరెన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.


ఈ దశలో తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై సీఎం మరో కీలక అడుగు ముందుకు వేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం..సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ వార్త విన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారి ఆనందం అవధులు దాటింది.ఇకపోతే మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సువర్ణాధ్యాయంగా మిగిలిపోవడమే కాకుండా, అసెంబ్లీలో బిల్లులు ఆమోదించిన ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారు జగన్ కొనియాడుతున్నారు.


ఇక ఔట్ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థ కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెబుతున్నారు అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే పనికి ఒకేరకమైన జీతం.. ఆన్‌లైన్‌ పద్ధతుల్లో జీతాల చెల్లింపు, పోర్టల్‌ద్వారా నియామకాలు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఇక ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుకు డిసెంబర్‌ 1 నుంచి ముమ్మర ప్రయత్నాలు చేయనుండగా.. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌  బిల్లుకు వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: