తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5వ తేదీ అర్ధ రాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది .  గత ఆరు రోజుల నుంచి బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి . ప్రజా రవాణా వ్యవస్థ కోసం సత్యం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ , ఆశించిన మేరకు ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరగడం  లేదన్నది జగమెరిగిన సత్యమే. దానికితోడు  సమ్మె ఇప్పట్లో ముగిసే సూచనలేవీ కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా  ప్రధానంగా నగరవాసులకు తీవ్ర  ఇబ్బందులు తప్పడం లేదు.


స్కూళ్ళు,   కాలేజీలకు దసరా సెలవులు ముగియడం ,  కార్యాలయాలకు వెళ్లాలనుకునే ప్రభుత్వ, పైవేట్ ఉద్యోగులకు  ఆర్టిసి బస్సులు ప్రధాన రవాణా మార్గం కాగా,  గత ఆరు రోజుల నుంచి సమ్మె వల్ల నగరంలో ఆర్టీసీ బస్సులు అంతంతమాత్రంగానే తిరుగుతున్నాయి.  దీంతో స్కూళ్ళు,   కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లాలనుకునే వారు  ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పటం లేదు. ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీకి  ప్రయాణికుల  జేబులకు చిల్లులు పడుతున్నాయి.  ఇక సమ్మె కు వెళ్లిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.


 తెలంగాణ సాధన ఉద్యమం లో భాగంగా  సకల జనుల సమ్మెలో  చేపట్టినట్లుగానే రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టాలని ఇందులో అన్ని పక్షాల వారిని భాగస్వాములుగా చేయాలని ఆర్టీసీ జే ఏ సి   భావిస్తోంది . ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుండడం  తో  అధికార పార్టీ ఒంటరి అయిపొయింది .  సమ్మెకు దారితీసిన పరిస్థితులను ఒకటి రెండు రోజుల వ్యవధిలో గవర్నర్ ను  కలిసి నివేదించాలని అఖిలపక్ష నాయకులు భావిస్తున్న తరుణం లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారిందని .


మరింత సమాచారం తెలుసుకోండి: