అక్టోబర్ 10 వ తేదికి చరిత్రలో చాలా ప్రత్యేక ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రోజున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న ఎంతోమంది నటులను, దర్శకులను అందింది.  ముఖ్యంగా వెండి తెరపై నవ్వులు పండిస్తున్న అలీ, ప్రకాష్ రెడ్డి, మల్లిఖార్జున రావులను అందించిన రోజుది. కాగా ఈ రోజున  ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు, జాతీయ దినోత్సవాలను పరిశీలిద్దాం..జాతీయ తపాలా దినోత్సవం.అభువృధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మాటున పోస్టల్ వ్యవస్థ దాదాపుగా నిరాదరణకు గురవుతున్నట్టే. ఒక విధంగా చెప్పాలంటే సమాచార రంగంలో తపాలా వ్యవస్థలో ఇంకా వెనుకబాటుతనం ఉన్నట్టుగానే నేటి ఆధునిక యువత భావిస్తుంది. ఈ నేపథ్యంలో తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం. ప్రపంచ నిర్వాసితుల రోజు ఇది. 



చరిత్రలో ఈ నాటి సంఘటనలను పరిశీలిద్దాం..18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో 1964 ప్రారంభమయ్యాయి. వరంగల్‌లో దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి 1959 లో  భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.
జననాలు..1731: హెన్రీ కేవిండిష్,బ్రిటిష్ తత్వవేత్త మరియు సైద్ధాంతిక రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త. (మ.1810),. 1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)., 1906: ఆర్.కె.నారాయణ్, ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001).,1908: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు (1980).,1914: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (మ.1993).,1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).,1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత..1927: నేదునూరి కృష్ణమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014).,1922: నర్రా మాధవరావు, నిజాం విమోచన పోరాటయోధుడు.,1933: సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.,1944: ఎల్.ఆర్.స్వామి, సుప్రసిద్ధ రచయిత మరియు అనువాదకుడు.




1945: జయప్రకాశ్ రెడ్డి, ప్రముఖ తెలుగు నటుడు.1945: కళ్ళు చిదంబరం, ప్రముఖ తెలుగు హాస్య నటుడు. (మ.2015),1947: ఎమ్. చంద్రసేనగౌడ్, ప్రముఖ రంగస్థల నటి.,1950: మాడా వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు. (మ.2015).,1954: రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది.,1956: గుండు హనుమంతరావు, ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు.(మ.2018).,1960: మల్లికార్జునరావు, ప్రముఖ తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008).,1960: యర్రా రఘు బాబు, ప్రముఖ తెలుగు సినీ నటుడు.,1968: ఆలీ (నటుడు), తెలుగు సినిమా హాస్యనటుడు.,1973: ఎస్. ఎస్. రాజమౌళి, తెలుగు చలనచిత్ర దర్శకుడు. మరణాలు..తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు 1958 మరణించారు. ఆయన 1892 లో జన్మించారు.  1908 లో పుట్టున తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు సుద్దాల హనుమంతు జానపద కళాకారుడు 1982 మృతి చేశారు. 1985: యూలి బోరిస్వోవిచ్ బ్రినెర్, హాలీవుడ్నటుడు. (జ.1920 జూలై 11), ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ 2011 లో మరణించారు. ఆయన 1941 లో జన్మించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: