ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మరో రెండు, మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం  .  ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వాహనాలను  ఆర్టీసీ బస్సులో స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని  అధికారులు ఇప్పటికే నిర్ణయించారు.  దసరా పండగకు  సొంత ఊర్లకు వెళ్లిన నగరవాసులు తిరిగి రావడానికి ప్రైవేట్ వాహనాలను విరివిగా వాడుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 


అందులో భాగంగానే విద్యా సంస్థలకు మరో రెండు,  మూడు రోజుల పాటు సెలవులు పొడిగించడం ద్వారా ప్రైవేటు విద్య సంస్థలకు చెందిన  వాహనాలను ఉపయోగించుకోవచ్చనన్న నిర్ణయానికి వచ్చారు. ఇక  ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా నగరంలో ప్రజా రవాణా పూర్తిగా  స్తంభించడం వల్ల విద్యార్థులకు రాకపోకలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల పాటు సెలవు పొడగించడమే  ఉత్తమమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది .  అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో రెండు , మూడు రోజుల్లో ఏమాత్రం ముగిసే అవకాశాలు లేకపోవడంతో , తరువాతైనా విద్యార్థులు స్కూళ్ళు , కాలేజీలకు వెళ్లిరావడానికి ఇబ్బందులు తప్పకపోవచ్చునని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు .


 ఆర్టీసీ బస్సుల్లో రాయితీ బస్సులపై ప్రయాణం చేసే  విద్యార్థులు, సమ్మె ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే , ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. అదే జరిగితే విద్యార్థుల జేబులకు చిల్లులు పడడం ఖాయంగా కన్పిస్తోంది . ఆర్టీసీ సమ్మె కు పూర్వం షేరింగ్ ఆటో లో పది రూపాయలు వసూలు చేసిన గమ్య స్థానానికి ప్రస్తుతం 40 రూపాయలు వసూలు చేస్తుండం చూస్తుంటే , తల్లితండ్రులు తమ పిల్లలను స్కూళ్ళు , కాలేజీలకు పంపడం కష్టమే మరి . 


మరింత సమాచారం తెలుసుకోండి: