రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆరొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రభుత్వం, మీరు దిగొచ్చే వరుకు మేము సమ్మె అపమూ అన్నట్టు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. మీరు మొండి.. అయితే నేను జగమొండి అన్నట్టు ప్రభుత్వం, కార్మికులు ప్రవర్తిస్తున్నారు. 


అయితే వీరి ఇద్దరి మధ్య ప్రయాణికులు నలిగిపోతున్నారు. పండగ వేళ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేల చేశారు. ఇంకా హైదరాబాద్ నగరంలో ప్రయాణించే వారికీ అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్లు చుక్కలు చూపిస్తున్నారు. 10 రూపాయిల టికెట్ 30 రూపాయలకు అమ్ముతున్నారు. టికెట్ ఇవ్వమంటే ఇచ్చేది లేదు ఉంటె ఉండు లేకుంటే దిగు అని అంటున్నారు.


ఇష్టారాజ్యంగా ప్రవర్తించే డ్రైవర్లకు చెక్ పెడుతూ తెలంగాణాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రైవేట్ డ్రైవర్ల పద్దతిని పరిగణలోకి తీసుకొని వారిని ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


టికెట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు స్పష్టం చేశారు. అయితే కొన్ని చోట్ల టికెట్ తరహా దోపిడులు జరుగుతున్నాయిని వాటిని నియంత్రించేందుకు ప్రత్యక చర్యలు తీసుకుంటామని, ప్రతి బస్సులో ఆయా రూట్లకు సంబంధించి ఉండే చార్జీల పట్టికను ఏర్పాటు చేస్తామని పువ్వాడ చెప్పారు. 


కాగా ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమిస్తున్నట్లు అయన చెప్పారు. టికెట్ చార్జీల పట్టక కింద ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లను కూడా ఉంటాయని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు. కాగా బస్‌పాస్‌లను యదావిధిగా ఆర్టీసీ బస్సులన్నింటా అనుమతిస్తున్నామని ఆదేశాలు ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: