కమలహాసన్ గారాలపట్టి శ్రుతిహాసన్ కి అందం ఉంది. అభినయం ఉంది. ఆమె వరసగా సినిమాలు చేస్తున్న టైమ్ లోనే లవ్ లో పడింది. అంతే సినిమా గినిమా జాన్తా నై అంటూ కొన్నాళ్ళ పాటు తెర వెనక్కుపోయింది. అయితే ఆ లవ్ కాస్తా ఫెయిల్ కావడంతో ఇపుడిపుడే మళ్ళీ వెండి తెర మీద మోజు పెంచుకుంది. బోల్డ్ గా మాట్లాడే శ్రుతి మంచు లక్ష్మి కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని అన్ని విషయాలను పంచుకుంది.


ప్రేమించడం గొప్ప కాదు అంటూనే తాను లవ్ లో పడి ఫెయిల్ అయ్యానని చెప్పేసింది. తన ప్రియుడుతో బ్రేకప్ అవడం పట్ల బాధ లేదని అది గొప్ప అనుభవం అంటోంది. తనలాగే ఎవరైనా ప్రేమిస్తారని, ఆ టైంలో అన్నీ మంచిగానే కనిపిస్తాయని కూడా శ్రుతి అంటోంది. మంచి చెడులు సందర్భాలను బట్టి ఉంటాయి తప్ప కచ్చితంగా అన్ని వేళల్లోనూ ఉండవని వేదాంతం వల్లించింది. లవ్ ఫెయిల్యూర్ వల్ల తనకు ఎలాంటి బాధ లేదని ఆమె అంటోంది.


ఇక తాను ఒకపుడు మద్యానికి బానిసను అన్న సీక్రెట్ ని కూడా బయటపెట్టిన శ్రుతి దాని నుంచి బయటపడడానికి తాను ఎంతో శ్రమపడాల్సివచ్చిందని కూడా చెప్పింది. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతోనే తాను మందుకు దూరం అయ్యానని అంటోంది. ఇక ప్రేమ విషయంలో మళ్ళీ రెడీ అంటూనే తనకు నచ్చినవాడు దొరికితే మళ్ళీ లవ్ స్టార్ట్ చేస్తానని అంటోంది.


ఇదిలా ఉండగా శ్రుతి తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ తరువాత మళ్లీ కనిపించలేదు. ఇపుడు మలినేని గోపీచంద్ డైరెక్షన్లో రవితేజా హీరోగా వస్తున్న మూవీలో శ్రుతి హీరోయిన్ గా నటిస్తోంది. మల్టీ టాలెంటెడ్ అయిన శ్రుతి సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా తన సత్తా చాటితే మళ్ళీ టాప్ ప్లేస్ ఆమె కోసం రెడీగా ఉంటుందండంతో డౌట్ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: