దసరా పండగ ముగించుకున్న ప్రజలు.. వారి గమ్య స్థానాలకు చేరేందుకు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. అయితే రద్దీ కూడా పెరిగి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరకన్న ఎక్కువ డబ్బులు గుజ్జుతున్నారన్న ఆరోపణులు ఉన్నాయి.  అటు ఆగిన చక్రాలు..ఆరొవ రోజు కూడా కదల్లేదు. ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులు... ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం సైతం వెనకడుగు వేయట్లేదు. వరుస నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, పోటాపోటీ భేటీలు, ప్రయాణికుల ఇబ్బందుల నడుమ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో  రోజుకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ముంచి షెడ్యూల్ ప్రకారం బస్సు లను నడిపేందుకు తెలంగాణ సర్కార్ సంనర్ధమవుతుంది. ఇదిలా ఉండగా బస్సుల్లో విద్యార్థులు, వికలాంగులు, ఉద్యోగుల బస్ పాసులను అనుమతించనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. కాగా  సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు ఇక్కట్లకు గురవుతున్నారు. తమ సమస్యలపై కార్మికులు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. పలుచోట్ల బస్సులు రోడ్డెక్కుకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. తాము సమ్మెలో ఉంటే బస్సులు ఎలా నడుపుతారంటూ అధికారులతో పలుచోట్ల వాగ్వాదానికి దిగారు. వినూత్నంగా నిరసనలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణాను బతికించుకోవడానికి తమ పోరాటమని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే సకల జనుల సమ్మెకు దిగుతామంటున్నారు. 7 వేల మంది కార్మికులు రిటైర్డ్ అయినా..ఖాళీలను భర్తీ చేయలేదు..మేం దాచుకున్న రూ. 2 వేల 400 కోట్లు వాడుకున్నారు..ప్రభుత్వం దిగిరాకపోతే..త్వరలో తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ  ప్రభుత్వం ధోరణిలో మార్పు కానరాదం లేదు. రోజురోజుకు రోడ్డెక్కే బస్సుల సంఖ్యను పెంచుతోంది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు ఎవరికి వారే సమ్మెపై పట్టుదలగా ఉండడంతో పండుగకు వెళ్లిన ప్రజలు మాత్రం ఇబ్బందిపడుతున్నారు.
 ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అవరమైన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి పువ్వాడ తెలిపారు. టికెట్ ధరకు రూపాయి అదనంగా తీసుకున్న వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని అయన ప్రయాణికులను కోరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: