రిలయన్స్ జియో సంస్థ జియో నెట్ వర్క్ నుండి ఇతర మొబైల్ నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు నిన్న ప్రకటించింది. జియో వాయిస్ కాలింగ్ కు వసూలు చేసే చార్జీకి సమానమైన ఉచిత డేటాను పరిహారంగా ఇస్తామని తెలిపింది. నిన్నటి నుండి రీచార్జ్ చేసుకునే అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు ఈ సవరణ వర్తిస్తుందని జియో స్పష్టం చేసింది. గడచిన మూడు సంవత్సరాల్లో జియో 13,500 కోట్ల రూపాయలు ఐయూసీ ఛార్జీల కింద ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ ఆపరేటర్లకు చెల్లించింది. 
 
గతంలో ఐయూసీ ఛార్జీలు 14 పైసలుగా ఉండగా 2017 సంవత్సరంలో ట్రాయ్ ఐయూసీ ఛార్జీలను 6 పైసలకు తగ్గించింది. రిలయన్స్ జియో ప్రస్తుతం నాలుగు ఐయూసీ ప్లాన్స్ ప్రకటించింది. 10 రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 124 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ ఇతర నెట్ వర్క్ లకు చేసుకోవచ్చు. 10 రూపాయల రీచార్జ్ కు జియో 1 జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. 20 రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 249 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ ఇతర నెట్ వర్క్ లకు చేయవచ్చు. 
 
20 రూపాయల రీచార్జ్ ప్లాన్ కు 2 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. 50 రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 656 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ ఇతర నెట్ వర్క్ లకు చేయవచ్చు. 50 రూపాయల రీచార్జ్ ప్లాన్ కు 5 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. 100 రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 1362 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ ఇతర నెట్ వర్క్ లకు చేయవచ్చు. 100 రూపాయల రీచార్జ్ ప్లాన్ కు  10 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. 
 
ఈ ప్లాన్ లతో పాటు నెల, మూడు నెలలకు చేసుకొనే 199, 399 ప్లాన్ లను రీచార్జ్ చేసుకుంటేనే ఈ ఐయూసీ ప్లాన్ లను ఉపయోగించుకోవచ్చు. ఐయూసీ ప్లాన్ రీచార్జ్ చేసుకోకపోతే కేవలం జియో నుండి జియోకు మాత్రమే కాల్ చేయవచ్చు. ప్రస్తుతం ట్రాయ్ ఐయూసీ చార్జీలను ఎత్తివేయాలా లేక అలాగే కొనసాగించాలా అనే విషయం గురించి చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం జియో నెట్ వర్క్ కు 25 - 30 కోట్ల మిస్డ్ కాల్స్ వస్తున్నాయని జియో కస్టమర్లు 65 - 75 కోట్ల ఔట్ గోయింగ్ కాల్స్ చేస్తున్నారని జియో తెలిపింది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: