అవును పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని పర్చూరు నుండి పోటి చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో అనేక పరిణామాలు జరిగాయి. దాంతో నియోజకవర్గంతో దగ్గుబాటి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనటం లేదు.

 

సరే ఈ విషయాలను పక్కనపెడితే దగ్గుబాటి భార్య పురంధేశ్వరి బిజెపిలో యాక్టివ్ గా ఉన్న విషయం అందరకీ తెలిసిందే. భార్య, భర్తలు చెరో పార్టీలో ఉండటం, అందులోను బిజెపి ప్రతి విషయంలోను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా చేసుకోవటం అందరూ చూస్తున్నదే. అందుకనే భార్య, భర్తలు ఇద్దరు ఏదో ఒక పార్టీలో ఉండటమే మేలని జగన్ అనుకున్నారట.

 

ఈ కారణంతోనే చాయిస్ దగ్గుబాటికే వదిలేసినట్లు సమాచారం. అంటే జగన్ పంపిన కబురు ప్రకారం పురంధేశ్వరి  బిజెపికి రాజీనామా చేసి వైసిపిలో చేరాలి. లేకపోతే దగ్గుబాటి అయినా వైసిపిని వదిలేయాలి. అయితే తనకు అందిన కబురు విషయమై నేరుగా జగన్ తోనే మాట్లాడి క్లారిటి తీసుకోవాలని దగ్గుబాటి చేసిన ప్రయత్నాలు సానుకూలం కాలేదని సమాచారం.

 

జగన్ తో కాకపోయినా కనీసం విజయసాయిరెడ్డితో అయినా మాట్లాడుదామని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. అంటే పార్టీలో కంటిన్యు అవ్వాలో లేకపోతే వదిలేయాలలో తేల్చుకోవాల్సిన సమయం దగ్గుబాటికి వచ్చినట్లే అని పార్టీలో చర్చ జరుగుతోంది.

 

నిజానికి వైసిపిలో దగ్గుబాటి పరిస్ధితి ఎలాగుందో బిజెపిలో పురంధేశ్వరి పరిస్ధితి కూడా ఇంచుమించు ఇలాగే ఉందనటంలో సందేహం లేదు. మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపిగా పోటి చేసిన పురంధేశ్వరికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పైగా అంతకుముందు రెండుసార్లు ఇక్కడి నుండే కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. అంటే పురంధేశ్వరికి వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పట్టులేదన్న విషయం అర్ధమైపోయింది.  కాబట్టి దగ్గుబాటి దంపతులు తొందరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోక తప్పేట్లు లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: