హుజూర్ నగర్ ఉప ఎన్నికను  అన్ని పార్టీలు  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ఈసారి ఎలాగైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందాలని సర్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎలక్షన్లలో స్వల్ప తేడాతో ఓడిపోయిన సైదిరెడ్డి కే మరోసారి సీటు కేటాయించింది టిఆర్ఎస్. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. అయితే దీనికోసం ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం లో పాల్గొని... ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలను విమర్శలతో ఎండగడుతూ తనదైన శైలిలో  ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కెసిఆర్ హుజూర్నగర్ ఓటర్లను ఆకర్షించేందుకు మరో ఆలోచన చేశారట. 

 

 

 

 

 

 టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావుని రంగంలోకి దించడానికి కేసిఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హుజూర్నగర్ ఓటర్లకు కెసిఆర్ రెండో దప  పాలన నిలువుటద్దంగా మారనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు నిర్ణయించనున్నాయి. ఇక తాజాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో... ప్రయాణికుల సౌకర్యార్థం సరైన బస్సు సౌకర్యాలు కల్పించకపోవడం... సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తాం అనడం కూడా ఇప్పటికే పార్టీ గెలుపును దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను అడుగు పెట్టి ప్రచారం చేసిన ప్రతీ చోట గెలుపును సాధించి టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పిలువబడే హరీష్ రావు ... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో  హరీష్ రావు  ప్రచారం చేస్తే టిఆర్ఎస్ విజయానికి కలిసి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. 

 

 

 

 

 

 అయితే హరీష్ రావు తన వాక్పటిమతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఓటర్లను  ఆకర్షించడమే కాకుండా... ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి  ప్రతిపక్షాలను నోర్లు మూయించగలడని  టిఆర్ఎస్ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే హరీష్ రావును హుజూర్నగర్ ఉప ఎన్నికల రంగంలోకి దించేందుకు టీఆర్ఎస్ అధినేత  ప్రయత్నిస్తున్నారని సమాచారం. చివరి రెండు లేదా మూడు రోజులు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా హరీష్ రావు పర్యటన చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా  చివరి రెండు రోజుల్లో హరీష్ ప్రచారం నిర్వహిస్తే టిఆర్ఎస్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని పార్టీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. మరి హరీష్ రావు ప్రచార రంగంలోకి దిగిన తర్వాత టిఆర్ఎస్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయా లేదా  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: