వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల సరపరా సంస్థ (ఎఫ్ ఎం సి జి ) – ప్రఖ్యాత ఐటీసీ – దేశవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం విస్తరిస్తున్నా తాము మాత్రం భవిష్యత్తుపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పింది. 15వ  "ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్" సందర్భంగా   సిఎన్ బిసి-టివి18 కు చెందిన క్రితిక సక్సేనాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో -ఐటీసీ చైర్మన్ & మానేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు 

“వాణిజ్యం పుంజుకోవటానికి కొంత సమయం అవసరం. ఈ ఆర్ధిక మంద గమన  ప్రభావం ఎలా ఉందో వివరంగా తెలియాలంటే –
*పండుగల తరుణానికి ముందుగా నిత్యావసరాల నిల్వల అందుబాటు,
*అమ్మకమవుతున్నప్పుడు అంతరాయం లేని వాటి నిరంతర సరపరా సరిగా ఉందా?  అలా ఉంటే మాత్రమే - వ్యాపారవేగాన్ని, పరిమాణాన్ని గుర్తించగలం లేదా తెలుసుకోగలం"  అని అన్నారు.

ఏదేమైనా తగ్గిపోయిన “పర్ కాపిటా కంజుంప్షన్స్” అంటే తలసరి నిత్యావసరాల వినియోగం,

*వినియోగదారుడు వస్తు కొనుగోలులో చూపే చొరవ –
*ఋతు పవన గమనం - ఆగమనం నిగమనం -
*భూసారం, వర్షం, భూమిలో తేమ తదితర వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తుంది ఈ విషయాలను చాలా సున్నితంగా గమనిస్తే-
*రానున్న పంటకాలం అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తుంది. అందుకే రేపటి భారత నిత్యావసరాల వినియోగ పరిస్థితులు వాణిజ్యాభివృద్ధి, అన్నీ ఆశాజనకంగానే ఉన్నాయి" అని సంజీవ్ పూరి చెప్పారు.  

అంతేకాదు, ఆర్ధికాభివృద్ధి దాని వేగంలో సుగుణాత్మక మార్పు అంతా -  కొన్ని విషయాల వలయంలో అంటే పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, ఎగుమతులు, ముడివస్తువుల అందుబాటు, సరపరా మొదలైన వాటి చట్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సైకిల్ లో తేడా వస్తే ఇబ్బందులు వస్తాయని లేకుంటే  ప్రస్తుతం ఆశజనకమే" అని సంజీవ్ పూరి అన్నారు. 

కేంద్ర ఆర్ధికశాఖ ఇటీవల కార్పోరేట్ టాక్స్ లో తెచ్చిన మార్పు పై విషయాలను ఆశాజనక మార్గంలో నడిపించగలవు. ఇంత కంటే ఆశాజనక పోటీని పెంచగలవు. ఈ వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక వ్యవస్థలను, ఉద్యోగిత పెంచి, సరైన గాడిలో పెట్టగల అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. రానున్న రేపటి ఆర్ధిక భవిష్యత్ పూర్తి ఆశాజనకంగా మారిపోతుంది" అని తాను నమ్ముతున్నానని సంజీవ్ పూరి ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.  
Image result for ITC CMD Sanjiv puri In 14 <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BUSINESS' target='_blank' title='business-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>business</a> leader Award    

మరింత సమాచారం తెలుసుకోండి: