అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సూరత్ కోర్టుకు హాజరయ్యారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఓ బీజేపీ నేత ఆయనపై పరువు నష్టం, క్రిమినల్ కేసులు వేశారు. ‘మోదీ పేరున్న వారందరూ దొంగలే’ అని ఎన్నికల సమయంలో రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లోనే బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి.

 

 

రాహుల్ వ్యాఖ్యలపై సూరత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ రాహుల్ వ్యాఖ్యలపై ఈ కేసు వేశారు. దీంతో చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా ఈ కేసులో రాహుల్ కు సమన్లు జారీ చేశారు. రాహుల్ పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ కేసు కింద సమన్లు జారీ చేశారు. దీనిపై సూరత్ కోర్టులో బీజేపీ నేత ఒకరు రాహుల్ వ్యాఖ్యలపై పరువు నష్టం, క్రిమినల్ కేసులు వేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ వ్యాఖ్యలు మోదీ పేరున్న వారందరినీ కించపరిచారంటూ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు బీజేపీ నేత పూర్ణేష్ మోదీ. నిజానికి ఈ కేసు విషయంలో రాహుల్ జూలైలోనే కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ ప్రత్యేక వినతి చేసుకోవడంతో అక్బోబర్ 10కి ఈ కేసును వాయిదా వేసింది కోర్టు.

 


రాహుల్ రాక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు చబదా స్పందించారు. రాహుల్ రాక సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి కోర్టు వరకూ భారీ స్వాగతం పలుకుతామని అన్నారు. కేంద్రం కూడా రాహుల్ కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. కేంద్రం భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఎస్పీజీ దళాలతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: