ఆరోపణలు చేయటానికి ఏమీ కనబడటం లేదు. విమర్శలు చేయటానికి కూడా అంశాలేవీ లేవు. ఒకటి రెండు అంశాల్లో తప్ప తీసుకున్న నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయి. పైగా చాలా పథకాలు, నిర్ణయాలకు జనాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇంకేముంది తెలుగుదేశంపార్టీకి మండిపోతోంది. అందుకనే నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తు జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.

 

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సొచ్చిందంటే తాజాగా టిడిపి ఎంఎల్సీ బుద్ధా వెంకన్న చేసిన ఆరోపణలు అంత చీపుగా ఉన్నాయి కాబట్టే.  రాష్ట్రంలో జె ట్యాక్స్ అమలవుతోందట. జే ట్యాక్స్ రూపంలో మద్యపాన నిషేధం ముసుగులో జగన్మోహన్ రెడ్డి రూ. 3 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెంకన్న నోటికొచ్చింది మాట్లాడేశారు.

 

ఎమ్మార్పీ కన్నా 20 రూపాయలు ఎక్కువగా మద్యం బాటిళ్ళపై అమ్ముకుంటు వేల కోట్ల రూపాయల స్కాంకు తెరదీసినట్లు బుద్ధా చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రతీ బాటిల్ పై 20 రూపాయలు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నదే నిజమనుకుందాం.  వసూలు చేసే ఆ 20 రూపాయలు ఆ షాపు వాళ్ళకే వెళుతుంది కానీ జగన్ కు ఎలా వస్తుంది ?

 

చదువుకున్న వాళ్ళతో మద్యం అమ్మకాలు చేయించటం ఏంటంటూ బుద్ధా బోల్డు బాధపడిపోతున్నారు. ఉత్తినే కూర్చోపెట్టి నిరుద్యోగ భృతి అనే డ్రామాలు ఆడటం కన్నా జగన్ చేస్తున్న పనే మంచిది కదా ? ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళనే అప్లై చేసుకోమని ప్రభుత్వం చెప్పింది. దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో కొందరిని సెలక్డ్ చేసి ఉద్యాగాలిచ్చారు.

 

ఉద్యోగాలు చేసే వాళ్ళకు లేని బాధ మధ్యలో వెంకన్నకు ఎందుకో అర్ధం కావటం లేదు. మద్యపాన నిషేధం అని జగన్ ఏనాడూ చెప్పలేదు. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే మొదటి విడతలో దాదాపు 800 షాపులను మూయించేశారు కదా ?  టిడిపి హయాంలో కె ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం గబ్బు పట్టటంతో పాటు పార్టీ ఇమేజి కూడా దెబ్బతిన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ ను గబ్బు పట్టించేందుకు జే ట్యాక్స్ అంటూ గోల చేస్తున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: