టీటీడీ ఛైర్మన్‌ అయి ఉండి రాజకీయ పంచాయితీలు చేయడం ఏంటని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉన్న వైవి సుబ్బారెడ్డి నివాసంలో నెల్లూరు పంచాయితీ ఎలా నిర్వహిస్తారని..,, ఆయనకు రాజకీయ పంచాయితీలతో ఏం అవసరమో చెప్పాలని., పైగా రైతు భరోసాపై చర్చించేందుకు కలిశామని చెప్పడం విడ్డూరంగా ఉందని.. రామయ్య ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తిరుపతి లాంటి ప్రముఖ క్షేత్ర ఛైర్మన్‌‌గా ఉన్న వ్యక్తికి రాజకీయ పంచాయితీ చేయాల్సిన అవసరం ఏముందని? టీటీడీ ఛైర్మన్ ఇంట్లో జరిగిన పంచాయితీ రాజకీయ చరిత్రలో ముందెప్పుడు జరగలేదని!. దొంగలు-దొంగలు కలిసి ఊళ్లను పంచుకునే పంచాయితీ లని,,  నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలంతా కూర్చొని సినిమాల్లో చూపించినట్లు ఆ ఊరు నాది.. ఈ ఊరు నాది అని పంచుకుంటున్నట్టుగా ఉందని రామయ్య ఎద్దేవా చేశారు.. 

ఎంపీడీవో సరళ విషయంలో శ్రీధర్ రెడ్డి ప్రవర్తించిన తీరుకు సైతం ప్రభుత్వం స్పందించ లేదని..,, పైగా చాలా సాధారణమైన శిక్ష విధించారని..,, అసలు ఎంపీడీవో సరళ వివాదంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించిఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి ఈ రోజు జైల్లో ఉండేవాడన్నారు. జగన్‌కు నైతిక విలువలుంటే శ్రీధర్‌రెడ్డిని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని., ప్రభుత్వం చట్టం అమలు చేస్తే కోటంరెడ్డి జైల్లో ఉండాలి.. కానీ సుబ్బారెడ్డి ఇంట్లో కాదన్నారు. ‘మీ ప్రభుత్వం., మీ ముఖ్యమంత్రి., మీరు చెప్పినట్లు వినే పోలీసులు కాబట్టి’ మీ ఆటలు సాగుతున్నాయని.., సోషల్ మీడియా పోస్టులపై వైఎస్సార్‌సీపీ నేతలతో చర్చకు సిద్ధమని., సీఎం వస్తే చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని.. లేదంటే వాళ్ల పార్టీ నేతలు వస్తే తమ పార్టీ నేతలు రెడీ అంటూ సవాళ్లు విసిరారు రామయ్య..

మరింత సమాచారం తెలుసుకోండి: