దసరా దీపావళి పండుగల సమయంలో ఈ కామర్స్ సంస్థలు ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటిస్తుంది.  మాములు సమయం కంటే ఫెస్టివల్ సమయంలో ఆఫర్లు ప్రకటిస్తూ.. వినియోగదారులను తమవైపు తిప్పుకుంటుంది.  ఈ కామర్స్ విభాగంలో అనేక సంస్థలు పోటీ పడుతుంటాయి.  వినియోగదారులను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుంటాయి.  అయితే, ఇప్పుడు ఈ బాటలో ప్రైవేట్ బ్యాంకులు కూడా ప్రవేస్తున్నాయి.  


మాములుగా ఈకామర్స్ సంస్థలతో బ్యాంకులు టైఅప్ అవుతుంటాయి.  వివిధ బ్యాంకుల నుంచి రాయితీలను ఇస్తుంటాయి.  అయితే, ఇప్పుడు హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ వినియోగదారుల కోసం దీపావళి ఆఫర్లను ప్రకటించింది.  నగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంత వాసులకోసం ఈ పధకాన్ని తీసుకొచ్చింది.  గ్రామాల్లో ఉండే వ్యక్తులు వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలి అనుకున్నా, గృహోపకరణాలు కొనుగోలు చేయాలి అనుకున్నా వాళ్లకు సులభమైన పద్దతిలో లోన్లు ఇచ్చేనందుకు హెచ్ డి ఎఫ్ సి సిద్ధం అయ్యింది.  


ప్రభుత్వపు కామన్ సర్వీస్ సెంటర్లలో రిజిస్టర్ చేసుకున్న1.2 లక్షల గ్రామ స్థాయి ఎంట్రప్రెన్యూర్ల  నెట్‌వర్క్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రామీణ ప్రాంతంలోని కస్టమర్లకు పండుగ ట్రీట్  ఆఫర్లు అందించనుంది. రుణాల దగ్గరి నుంచి సేవింగ్స్ అకౌంట్ల వరకు కస్టమర్లు ప్రత్యేక ఆఫర్లు పొందొచ్చని హెచ్ డిఎఫ్ సి తెలిపింది. అలాగే 1,000 బ్రాండ్లకు పైగా డిస్కౌంట్ లభిస్తుందని హెచ్ డి ఎఫ్ సి ఓ ప్రకటనలో పేర్కొంది.  


పట్టణ, నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఎంట్రప్రెన్యూవర్లను పెంచడమే లక్ష్యంగా హెచ్ డి ఎఫ్ సి ఈ  ఫెస్టివ్ ట్రీట్ ను తీసుకొచ్చింది.  దీని వలన గ్రామాల్లో వ్యాపారం చేయాలి అనుకున్న వ్యక్తులకు సులభంగా రుణాలను పొందేందుకు అవకాశం ఉంది.  అయితే, వీరు ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లలో రిజిస్టర్ అయ్యి ఉండాలి.  అప్పుడే వారికీ రుణాలు లభించే అవకాశం ఉంటుంది.  వ్యాపారం చేసుకునే వాళ్లకు ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: